Lockdown 2.0 : ఏప్రిల్ 30 కాదు..మే 03 వరకు..ఆ 3 రోజులు పొడిగింపు ఎందుకో తెలుసా

  • Published By: madhu ,Published On : April 14, 2020 / 06:46 AM IST
Lockdown 2.0 : ఏప్రిల్ 30 కాదు..మే 03 వరకు..ఆ 3 రోజులు పొడిగింపు ఎందుకో తెలుసా

భారతదేశం ఎప్పటి వరకు లాక్ డౌన్ ఉండనున్న విషయంపై క్లారిటీ వచ్చేసింది. లాక్ డౌన్ పొడగింపు కొనసాగిస్తారా ? లేక ఎత్తివేస్తారా ? ఉత్కంఠగా ఎదురు చూసిన ప్రజలకు సమాధానం చెప్పారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. 2020, మే 03వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. అంటే..ఇంకా 19 రోజులన్న మాట. లాక్ డౌన్ పొడిగించాలని ఇప్పటికే పలు రాష్ట్రాల కోరాయి.

అంతేకాదు..తమ రాష్ట్రంలో లాక్ డౌన్ ఏప్రిల్ 30వ తేదీ వరకు కంటిన్యూ చేస్తున్నట్లు ఆయా రాష్ట్రాలు ప్రకటించాయి. కానీ కేంద్రం మాత్రం మరో 3 రోజులు ఎందుకు పొడిగించిందనే దానిపై హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రాకాసి విస్తరిస్తోంది. ఈ క్రమంలో లాక్ డౌన్ ఎత్తివేస్తే పరిస్థితి దారుణంగా తయారవుతుందని కేంద్రం భావించింది. లాక్ డౌన్ కొనసాగించాలా ? వద్దా ? అనే దానిపై రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకుంది.

ఏప్రిల్ 30వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగించాలని కేంద్రాన్ని కోరాయి. ఆయా రాష్ట్రాలు కూడా అదేవిధంగా నిర్ణయం తీసుకున్నాయి. పీఎం మోడీ కూడా ఇదే విధంగా నిర్ణయం తీసుకుంటారని అందరూ భావించారు. కానీ..మే 03వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. మే 1వ తేదీన మే డే(సెలవు), 2వ తేదీన శనివారం, 3వ తేదీన ఆదివారం వచ్చింది.

వరుసగా మూడు రోజులు హాలీడేస్ వచ్చాయి. ఈ క్రమంలో..లాక్ డౌన్ ఎత్తివేస్తే..ప్రజలంతా…రోడ్ల మీదకు ఒక్కసారిగా వస్తారని కేంద్రం అంచనా వేసినట్లు సమాచారం. అందుకే…ప్రధాని మోదీ మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించారని సమాచారం.