Lockdown 3.0: రోడ్లపై వెళ్లాలనుకుంటే ఈ రూల్స్ తప్పనిసరి

  • Published By: Subhan ,Published On : May 1, 2020 / 02:42 PM IST
Lockdown 3.0: రోడ్లపై వెళ్లాలనుకుంటే ఈ రూల్స్ తప్పనిసరి

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మరో 2వారాలు పొడిగించారు. మూడో దశను పొడిగిస్తూ ఇచ్చిన ఆదేశాలు గతంలో విధించిన కఠిన నిబంధనల్లా కాకుండా కొన్ని సడలింపులు ఇచ్చారు. కేంద్రం మూడు జోన్లుగా కేటాయించిన లాక్‌డౌన్‌లో జోన్లను బట్టి సదుపాయాలు కల్పించారు. ఇండస్ట్రీలు, సెక్టార్లు రీ ఓపెన్ చేసినప్పటికీ ట్రావెలింగ్ సమస్యగానే ఉంది. విమానాలు, రైళ్లు (ప్రత్యేక రైళ్లు) మినహాయించి రాకపోకలు అన్నింటినీ నిషేదించింది. 

అంతర్ రాష్ట్ర పర్యటనలు: అనుమతులు ఉన్న వాహనాలకు మాత్రమే అంతర్ రాష్ట్ర పర్యటనలు చేయొచ్చు. వస్తువుల రవాణా, మెడికల్ సప్లై, బంధువుల చావుకు, అంత్రక్రియలకు అనుమతులు ఉన్నాయి. 

రెడ్ జోన్లలో: రెడ్ జోన్లలో కేవలం అనుమతులు ఉన్న వాహనాలకు మాత్రమే తిరగేందుకు అవకాశం ఉంది. ఫోర్ వీలర్స్ వాహనంలో డ్రైవర్ తో పాటు ఒక్కరే ప్రయాణించాలి. టూ వీలర్ పైన ఒక్కరే ప్రయాణించాలి. 

ఆరంజ్ జోన్లలో: ట్యాక్సీ, క్యాబ్ సర్వీసులు నడిపేవారికి అనుమతులు ఉన్నాయి. ప్రతి క్యాబ్ లో ఒక ప్యాసింజర్ మాత్రమే.. ఒక్కసారి మాత్రమే ప్రయాణించాలి.

గ్రీన్ జోన్లలో: బస్సుల్లో 50శాతం మంది ప్రయాణించొచ్చు. లాక్ డౌన్ పొడిగించిన తర్వాత 50శాతం బస్సులు మాత్రమే నడపాలి. 

మీ జిల్లాలు రెడ్, ఆరంజ్, గ్రీన్ జోన్ల పరిధిలో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి మి. దానిని బట్టే మీ ప్రయాణాల ఏర్పాటు చేసుకోండి.