మహా­రా­ష్ట్రలో మళ్లీ కరోనా విజృంభణ..అమరావతి జిల్లాలో లాక్‌డౌన్‌

మహా­రా­ష్ట్రలో మళ్లీ  కరోనా విజృంభణ..అమరావతి జిల్లాలో లాక్‌డౌన్‌

Lockdown మహా­రా­ష్ట్రలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. రోజువారీ నమోదు కేసుల సంఖ్య మళ్లీ ఐదు వేలు దాటింది. అమరావతి జిల్లాలో గత ఐదు రోజులుగా కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్నది.

బుధవారం నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 5,427 కరోనా కేసులు, 38 మర­ణాలు నమో­ద­య్యాయి. దీంతో మహా­రా­ష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,81,520కు, మర­ణాల సంఖ్య 51,669కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 40,858 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ఆరో­గ్య­శాఖ తెలి­పింది.

మరోవైపు కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న అమరావతి జిల్లాల్లో లాక్‌డౌన్‌ విధించింది. శనివారం (:ఫిబ్రవరి-20) రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు కఠినమైన లాక్‌డౌన్‌ అమలులో ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఇక కరోనా తీవ్రత ఎక్కువగా వున్నా యవత్మల్ జిల్లాలో కూడా ఆంక్షలు విధిస్తున్నట్లు అక్కడి కలెక్టర్ యండీ సింగ్ తెలిపారు. అయితే యవత్మల్ జిల్లాలోవిధించింది లాక్ డౌన్ కాదని అయన తెలిపారు