మహారాష్ట్రలో లాక్ డౌన్ విధించడం ఒక్కటే మార్గం : ఉద్దవ్ ఠాక్రే

కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్రలో మార్చి 31 వరకు నూతన ఆంక్షలు విధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం అన్ని థియేటర్లు, ఆడిటోరియంలు.. 50 శాతం సామర్థ్యంతో మాత్రమే నడుస్తాయని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

మహారాష్ట్రలో లాక్ డౌన్ విధించడం ఒక్కటే మార్గం : ఉద్దవ్ ఠాక్రే

Lockdown

Lockdown కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్రలో మార్చి 31 వరకు నూతన ఆంక్షలు విధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం అన్ని థియేటర్లు, ఆడిటోరియంలు.. 50 శాతం సామర్థ్యంతో మాత్రమే నడుస్తాయని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మాస్కులు సరిగా ధరించనివారికి అనుమతి ఉండబోదని స్పష్టం చేసింది. అన్ని ప్రైవేటు కార్యాలయాల్లో 50 శాతం మంది సిబ్బంది మాత్రమే హాజరు కావాలని పేర్కొంది.

మహారాష్ట్రలో మళ్లీ కరోనా విజృంభిస్తున్న సమయంలో ఆ రాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నన్దుర్బార్ లో సీఎం ఉద్దవ్ ఠాక్రే మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధించడం తప్ప వేరే మార్గం లేదని అభిప్రాయపడ్డారు. అయితే, గతంలో మాదిరిగా ఇప్పుడు కూడా ప్రజలు స్వచ్ఛందంగా కోవిడ్-19 నిబంధనలు పాటిస్తారన్న నమ్మకం తనకుందని ఉద్దవ్ అన్నారు. అర్హులైనవారందరూ భయకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని ఉద్దవ్ సూచించారు.

గతేడాది కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పుడు వైరస్ పై పోరాడే ఆయుధమేమీ మనదగ్గర లేదని,కానీ ఇప్పుడు మన దగ్గర రక్షణ కవచంగా వ్యాక్సిన్ ఉందని సీఎం అన్నారు. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించాలనేదే తమ ప్రియారిటీ అని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రజలు భయపడకుండా ముందుకురావాలన్నారు. వ్యాక్సిన్ ల కొరత ఉండబోదని కేంద్రప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్నవారికి వైరస్ సోకిన కేసులు చాలా తక్కువ అని,కానీ ఆ కేసులు కూడా ప్రాణాపాయమైనవి కాదని సీఎం తెలిపారు.