లాక్ డౌన్ ఎత్తేసినా..తొలగించినా..మరికొన్ని రోజులు మాస్క్ లు, అవి తప్పనిసరి

  • Published By: madhu ,Published On : April 11, 2020 / 02:33 PM IST
లాక్ డౌన్ ఎత్తేసినా..తొలగించినా..మరికొన్ని రోజులు మాస్క్ లు, అవి తప్పనిసరి

కరోనా మహమ్మారీ ఇంకా వీడడం లేదు. ఈ వైరస్ ధాటికి ఎన్నో ప్రాణాలు బలై పోయాయి. చైనా నుంచి వచ్చిన ఈ రాకాసి మూడు నెలలుగా విజృంభిస్తోంది. ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తున్న ఈ భయంకరమైన వ్యాధికి మందులు లేకపోవడంతో అందరిలో భయం నెలకొంటోంది. కొన్ని దేశాల్లో వైరస్ తగ్గుముఖం పడుతుందని అనుకుంటున్న క్రమంలో..మరలా కేసులు నమోదవుతుండడం తీవ్ర ఆందోళన రేకేత్తిస్తోంది.

వైరస్ కట్టడికి ఎన్నో దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా లాక్ డౌన్ లు విధిస్తున్నాయి. ప్రజలు బయటకు రాకుండా ఉండాలని సూచిస్తున్నాయి. ఇండియాలో తొలుత విదేశాల నుంచి వచ్చిన వారిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. కానీ తర్వాత..కాంటాక్ట్ కేసులు నమోదు కావడం వ్యాధి ఎంత తీవ్రంగా ప్రబలుతుందో అర్థమైంది. భారతదేశంలో 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించింది కేంద్రం. ఏప్రిల్ 14 తర్వాత..ఈ గడువు ముగియనుంది. కానీ..ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ కొనసాగించాలని కేంద్రం నిర్ణయం తీసుకొందని సమాచారం. 

ఇదంతా ఒక్క వైపు అని..లాక్ డౌన్ ఎత్తేసినా..కొనసాగించినా..ప్రస్తుతం తీసుకుంటున్న జాగ్రత్తలు పాటించాలని వైద్యులు, నిపుణులు సూచిస్తున్నారు. 10tvలో జరిగిన చర్చా వేదికలో డా. ముఖర్జీ సూచనలు అందచేశారు. ఎక్కువ కేసులు రాకుండా ఉండేందుకు లాక్ డౌన్ పెట్టారని, దీనివల్ల వైరస్ ను పూర్తిగా కట్టడి చేయలేమన్నారు. కానీ..లాక్ డౌన్ ద్వారా వందకు వంద శాతం విజయం సాధించామన్నారు.

కరోనా వైరస్ కొన్ని రోజుల పాటు ఉంటుందని, దీనివల్ల వైరస్ లేని వారిలో లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు. ఏదో లాక్ డౌన్ ఇక ఉండదని, వైరస్ ఇక రాదని ప్రజలు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా..ప్రమాదమంటున్నారు. కరోనా చాలా స్లోగా వ్యాపిస్తుందని, మొత్తంగా ఈ వైరస్ ను చంపలేమని వెల్లడిస్తున్నారు. లాక్ డౌన్ ఎందుకు చేపడుతున్నాం ? తదితర వివరాలను ప్రజలకు వెల్లడించాలని సూచించారు. అలాగే…ఎక్కడికక్కడ టెస్టులు నిర్వహిస్తే బాగుంటుందని, దీనివల్ల చాలా ఉపయోగం ఉందన్నారు.