లాక్ డౌన్..మాంగల్యం తంతునానేనా : నాలుగు నిమిషాల్లో పెళ్లి

  • Published By: madhu ,Published On : April 6, 2020 / 06:07 AM IST
లాక్ డౌన్..మాంగల్యం తంతునానేనా : నాలుగు నిమిషాల్లో పెళ్లి

కరోనా రాకాసి వల్ల ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు. భారతదేశం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. వైరస్ ప్రవేశించిన రోజుల్లో వివాహ శుభఘడియలు కొనసాగుతున్నాయి. ఆంక్షల నడుమ కొన్ని పెళ్లిళ్లు జరిగాయి. వైరస్ మరింత విజృంభిస్తుండడంతో ఆంక్షలు మరింత కఠినమయ్యాయి. జీవితంలో ఒక్కసారి జరిపించుకొనే ఈ ఘట్టాన్ని తూ.తూ మంత్రంగా నిర్వహించుకుంటున్నారు.

వధూవరుల కుటుంబసభ్యులు..అదీ..కొద్ది మంది నడుమ ఈ వివాహ వేడుకలు జరుగుతున్నాయి. తాజాగా మైసూర్ లో ఓ పెళ్లి వేడుక కేవలం నాలుగు నిమిషాల్లో పూర్తవడం వైరల్ గా మారింది. 

సివిల్ ఇంజనీర్ అయిన సోనియా, ఎలక్ట్రానిక్ ఇంజనీర్ అయిన పరుశురామ్ లకు వివాహం నిశ్చయమైంది. 2020, ఏప్రిల్ 17వ తేదీన ముహూర్తం ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసిన సమయంలో కరోనా భయం లేదు. దీంతో ఫుల్ గ్రాండ్ గా మ్యారేజ్ చేసుకుందామని ఇరు కుటుంబాలు అనుకున్నారు. కానీ కరోనా వైరస్ విపరీతంగా వ్యాపించింది. కేసులు అధికమౌతుండడం, మరణాల సంఖ్య కూడా ఎక్కువ కావడంతో లాక్ డౌన్ ప్రకటించింది కేంద్రం.

మైసూర్ లోని గోకులం గణపతి దేవాలయంలో వివాహం జరిపించాలని అనుకున్నారు. 2020, ఏప్రిల్ 05వ తేదీ ఆదివారమే మాంగల్యం తంతునేనా అనిపించారు. కేవలం న నాలుగు నిమిషాల్లోనే పెళ్లి జరగడంపై వధూవరులు నిరుత్సాహానికి గురయ్యారు. 

See Also | పనిలేక డబ్బుల్లేవ్.. తినడానికి తిండి లేక.. అక్కడ వ్యభిచారిణుల పరిస్థితి ఇది