లాక్ డౌన్ మార్గదర్శకాలు పొడిగింపు, స్విమ్మింగ్ ఫూల్స్, ఎగ్జిబిషన్ హాళ్లకు ఫర్మిషన్

లాక్ డౌన్ మార్గదర్శకాలు పొడిగింపు, స్విమ్మింగ్ ఫూల్స్, ఎగ్జిబిషన్ హాళ్లకు ఫర్మిషన్

lockdown rules : లాక్‌డౌన్‌ మార్గదర్శకాలను కేంద్రం మరోసారి పొడిగించింది. నవంబర్‌లో ఇచ్చిన మార్గదర్శకాలను ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుండటంతో మరిన్ని సడలింపులు ఇచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త మార్గదర్శకాలను ఆయా శాఖలు విడుదల చేస్తాయని ప్రకటించింది. ప్రస్తుతం 50శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్న సినిమా థియేటర్లు ఇకనుంచీ అంతకన్నా ఎక్కువ సామర్థ్యంతో తెరుచుకోవచ్చని కేంద్రం తెలిపింది. స్విమ్మింగ్‌ పూల్స్‌కు వెళ్లేందుకు అందరికీ అనుమతిచ్చింది. కంటైన్‌మెంట్‌ జోన్‌ల వెలుపల అన్ని కార్యకలాపాలకూ ఓకే చెప్పింది. అన్ని రకాల ఎగ్జిబిషన్‌ హాళ్లకు పర్మిషన్‌ ఇచ్చింది.

ఇక…సామాజిక, ఆధ్యాత్మిక, క్రీడా, సాంస్కృతిక సభలు, సమావేశాలకు ప్రస్తుతం 200 మందికి మాత్రమే అనుతిచ్చిన కేంద్రం ఇప్పుడు ఆ నిబంధనలను సడలించింది. ఆయా రాష్ట్రాల మార్గదర్శకాలకు అనుగుణంగా అనుమతికి అవకాశం కల్పించింది. అలాగే…అంతర్జాతీయ విమాన సర్వీసులపై పౌర విమానయాన శాఖ కేంద్రహోం శాఖతో పరిస్థితులపై సమీక్షించి నిర్ణయం తీసుకోనుంది. 65 ఏళ్లు పైబడినవారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, గర్భిణులు, పదేళ్ల లోపు చిన్నారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.