Lockdown: రేషన్ కోసం క్యూలో నిలబడి చనిపోయిన మహిళ

Lockdown: రేషన్ కోసం క్యూలో నిలబడి చనిపోయిన మహిళ

లాక్‌డౌన్ సమయంలో ఆకలి తీర్చడానికి ప్రభుత్వం అందిస్తున్న రేషన్ తీసుకోవడానికి వచ్చిన మహిళ అక్కడే ప్రాణాలు విడిచింది. ఉత్తరప్రదేశ్ లోని బడౌన్ జిల్లాకు చెందిన 35ఏళ్ల యువతి రేషన్ కోసం క్యూలో నిల్చొంది. శనివారం హాస్పిటల్ వద్ద రేషన్ ఇస్తున్నారని తెలిసి లైన్లో నిల్చొని అక్కడకు వెళ్లింది. ఉన్నట్టుండి కుప్పకూలడంతో గమనించిన స్థానికులు స్పృహ కోల్పోయి ప్రాణం విడిచినట్లు చెబుతున్నారు. 

సమాచారం అందుకున్న పోలీసులు.. శవాన్ని పోస్టు మార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. ‘షాపు వద్ద రేషన్ బియ్యం కోసం నిల్చొని ప్రాణం విడిచినట్లు సమాచారం అందింది. జిల్లా సరఫరాల అధికారిని వెంటనే అక్కడకు పంపించాం. చనిపోయినందుకు కారణాలు తెలిసిరాలేదు. ప్రాథమిక విచారణలో గుండెనొప్పితో చనిపోయినట్లు భావిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే  కుటుంబానికి సాయం చేసినట్లు అవుతుందని జిల్లా మెజిస్ట్రేట్ కుమార్ ప్రశాంత్ అన్నారు. 

గ్రామస్థుల కథనం ప్రకారం.. మహిళ గుండెనొప్పితో చనిపోయింది. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని జిల్లా సరఫరాల అధికారి రామేంద్ర ప్రతాప్ సింగ్ అన్నారు. ఫోన్ నెట్‌వర్క్ నెమ్మెదిగా ఉండటం, ఇంటర్నెట్ సిగ్నల్ అందడానికి ఎక్కువ సమయం పట్టడంతో వౌచర్స్ చింపడానికి చాలా సమయం పడుతుంది. అందుకే రేషన్ ఇవ్వడానికి ఆలస్యమవుతోందని చెప్పుకొచ్చాడు ఆ అధికారి. 

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లాక్ డౌన్ సమయంలో సహాయక చర్యల్లో భాగంగా పేదలకు ఉచితంగా బియ్యం అందించేందుకు సిద్దమైంది. వ్యాపారాలు మూసుకుపోయి, ఉద్యోగాల్లేక ఆహారం కొనుక్కోవడానికి డబ్బుల్లేక బాధలుపడుతున్నారు.