Maharashtra : ప్రాణాలను పణంగా పెట్టి ఆగిపోయిన రైలును తిరిగి నడిపిన లోకో పైలట్

రైళ్లలో ప్రయాణించేటప్పుడు అత్యవసర సమయాల్లో రైలు ఆగటానికి చైన్ ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అత్యవసర సమయాల్లో ఆ చైన్ లాగి రైలు ఆపుతూ ఉంటారు.

Maharashtra : ప్రాణాలను పణంగా పెట్టి ఆగిపోయిన రైలును తిరిగి నడిపిన లోకో పైలట్

Loco Pilot

Maharashtra :  రైళ్లలో ప్రయాణించేటప్పుడు అత్యవసర సమయాల్లో రైలు ఆగటానికి చైన్ ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అత్యవసర సమయాల్లో ఆ చైన్ లాగి రైలు ఆపుతూ ఉంటారు. కొందరు అకతాయిలు అవసరం ఉన్నా లేకున్నా అప్పుడప్పుడు చైన్ లాగుతూ ఉంటారు.

ఆ రైలు భూమి మీద ఆగితే పర్వాలేదు  కానీ వంతెనల మీద ఆగితే చాలా కష్టం. ఎందుకంటే రైలును తిరిగి నడపాలంటే ఆబోగి వద్దకు లోకో పైలట్ వచ్చి  ఎమర్జెన్సీ బ్రేక్ ను   తిరిగి రీసెట్ చేయాల్సి ఉంటుంది. తాజాగా ముంబైకి   80 కిలోమీటర్ల దూరంలో వంతెనపై   ఆగిపోయిన   రైలును లోకో  పైలట్ రీసెట్ చేసి తిరిగి నడిపించిన వీడియోను  రైల్వే  మంత్రిత్వ  శాఖ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అనవసరంగా చైన్ లాగవద్దని   ప్రజలకు  విజ్ఞప్తి  చేస్తోంది.

కళ్యాణ్ నుండి గోరఖ్ పూర్   వెళుతున్న  గోదాన్ ఎక్స్ ప్రెస్ లో   ఒక గుర్తు తెలియని ప్రయాణికుడు ఎమర్జెన్సీ చైన్ లాగాడు.  రైలు   టిట్వాలా-ఖడ్‌వాలీ స్టేషన్ల    మధ్య ఉన్న ఒక వంతెనపై   ఆగి పోయింది.  అది సింగిల్ లైన్ ట్రాక్.   కనీసం ఇంకో  వ్యక్తి  నిలబడటానికి  అవకాశం కూడా లేని వంతెన అది.   ఎమర్జెన్సీ బ్రేక్ ను   రీసెట్ చేయటానికి లోక్ పైలట్ సతీష్ కుమార్ కేవలం తాను మాత్రమే వెళ్లగల ఖాళీ స్ధలంలోంచి వెళ్లి ఎమర్జెన్సీ    బ్రేక్ ను   రీ సెట్ చేసి వచ్చాడు.

ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా   దాదాపు 30 అడుగుల లోతులో   ఉన్న నదిలో పడిపోయే అవకాశం ఉంది. అలాంటి  స్ధలంలో  ప్రాణాలను పణంగా పెట్టి   తన   ఉద్యోగ ధర్మాన్ని   నిర్వర్తించి  తిరిగి  రైలును ముందుకు తీసుకు వెళ్ళాడు. ఈ దృశ్యాలను అతని సహచరులు  వీడియో  తీసారు. ఆ వీడియోను  రైల్వే   మంత్రిత్వశాఖ తన  ట్విట్టర్  ఖాతాలో  పోస్ట్ చేసి  అనవసరంగా  చైన్ లాగవద్దని మరోసారి ప్రయాణికులకు  విజ్ఞప్తి చేసింది.