డబ్బే డబ్బు : ఎన్నికల తనిఖీల్లో రూ.143 కోట్లు పట్టివేత

సార్వత్రిక ఎన్నికల వేళ భారీగా డబ్బు, మద్యం పట్టుబుడుతున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రూ.143 కోట్లు పట్టుబడినట్టు ఈసీ చెప్పింది. 17వ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా

  • Published By: veegamteam ,Published On : March 26, 2019 / 08:00 AM IST
డబ్బే డబ్బు : ఎన్నికల తనిఖీల్లో రూ.143 కోట్లు పట్టివేత

సార్వత్రిక ఎన్నికల వేళ భారీగా డబ్బు, మద్యం పట్టుబుడుతున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రూ.143 కోట్లు పట్టుబడినట్టు ఈసీ చెప్పింది. 17వ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా

ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల వేళ భారీగా డబ్బు, మద్యం పట్టుబడుతున్నాయి. నగదు, మద్యం అక్రమ సరఫరాపై ఫోకస్ పెట్టిన ఈసీ.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రూ.143 కోట్లు పట్టుబడినట్టు చెప్పింది. 17వ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రక్రియలో భాగంగా 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికల అధికారులు, పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఇప్పటి వరకు రూ. 143.47 కోట్లను సీజ్ చేశారు. దీని సంబంధించిన లెక్కలను ఈసీ తెలిపింది. రూ. 89.64 కోట్ల విలువ చేసే మద్యం, రూ. 131.75 కోట్ల విలువ చేసే డ్రగ్స్, రూ. 162.93 కోట్ల విలువైన ఖరీదైన వస్తువులు, రూ. 12.202 కోట్ల విలువ చేసే గిఫ్ట్‌లను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు చెప్పారు.

ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. డబ్బు, మద్యంతో ఓటు కొనే పనిలో ఉన్నాయి. ఈ ప్రలోభాల పర్వానికి అడ్డుకట్ట వేసేందుకు ఈసీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది. పోలీసులు, ఎన్నికల అధికారులు… వాహనాలను విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో డబ్బు తరలిస్తూ కొందరు పట్టుబడ్డారు. సరైన ఆధారాలు చూపించని వారి నుంచి అధికారులు డబ్బు స్వాధీనం చేసుకుంటున్నారు. ఈసీ లెక్కల ప్రకారం ఏపీలో 91 కిలోల బంగారం, 230 కిలోల వెండి పట్టుబడింది. రూ.55 కోట్ల నగదు కూడా ఉంది. రూ.12కోట్ల విలువైన 2.5 లక్షల లీటర్ల మద్యం సీజ్ చేశారు.