వరుణ్ గాంధీకి వరుణ్ గాంధీ ఎఫెక్ట్: 2014లో 14వేల 21ఓట్లు.. ఏపీలో కూడా ఇదే జరిగితే!

ఇది చూడడానికి, కనిపించడానికి చాలా చిన్న ప్రాబ్లమ్.. అయితే అనుకున్నంత చిన్న ప్రాబ్లం మాత్రం కాదు ఇది.

  • Published By: vamsi ,Published On : April 9, 2019 / 07:31 AM IST
వరుణ్ గాంధీకి వరుణ్ గాంధీ ఎఫెక్ట్: 2014లో 14వేల 21ఓట్లు.. ఏపీలో కూడా ఇదే జరిగితే!

ఇది చూడడానికి, కనిపించడానికి చాలా చిన్న ప్రాబ్లమ్.. అయితే అనుకున్నంత చిన్న ప్రాబ్లం మాత్రం కాదు ఇది.

ఇది చూడడానికి, కనిపించడానికి చాలా చిన్న ప్రాబ్లమ్.. అయితే అనుకున్నంత చిన్న ప్రాబ్లం మాత్రం కాదు ఇది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ నాయకుడు, పార్లమెంట్ నేత వరుణ్ గాంధీకి ఎన్నికల్లో వచ్చిన తిప్పలు ఇప్పుడు అవే.. గతంలో వచ్చినవి ఇవే. అసలు విషయం ఏమిటంటే… ఓకే పేరు, ఒకే పార్టీ గుర్తు ఉన్న కారణంగా ఓట్లు వేసే ఓటర్లు ఇబ్బంది పడుతుంటారు. ఉత్తరప్రదేశ్‌లో పీలీభీత్ నుంచి బీజేపీ అభ్యర్థిగా వరుణ్‌ గాంధీ పోటీ చేస్తుండగా.. రెవాడీకి చెందిన వరుణ్ గాంధీ అనే మరో వ్యక్తి ఎన్నికల బరిలో దిగాడు. స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్న వరుణ్ గాంధీకి గోబీ పువ్వు గుర్తుగా లభించింది.
Read Also : కట్టలు తెగుతున్నాయ్ : లంగర్ హౌస్ లో రూ.2.40 కోట్లు పట్టివేత

ఇదే వరుణ్ గాంధీ 2014లో కూడా స్వతంత్ర అభ్యర్థిగా సుల్తాన్‌పూర్ నుంచి బరిలోకి దిగిన బీజేపీ నేత వరుణ్ గాంధీపై పోటీకి దిగారు. అప్పట్లో కూడా అతనికి గోభీ పువ్వు ఎన్నికల చిహ్నంగా ఎన్నికల సంఘం కేటాయించింది. ఆ సమయంలో అతనికి 14 వేల 21ఓట్లు వచ్చాయి. అయితే ఆ ఎన్నికల్లో 4లక్షల 10వేల 348ఓట్లు రావడంతో లక్షా 78వేల 902 ఓట్లతో బీజేపీ నేత వరుణ్ గాంధీ గెలిచారు. కానీ స్వతంత్ర అభ్యర్థికి వచ్చిన ఓట్లు బీజేపీ నేతకు రావలసిన ఓట్లు అని బీజేపీ తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో గ్రహించింది.

ఈ విషయమై రెవాడీకి చెందిన స్వతంత్ర అభ్యర్ధి వరుణ్‌గాంధీ మాట్లాడుతూ 2012లో తాను వరుణ్ గాంధీని కలిసేందుకు ఢిల్లీ వెళ్లానని, ఎన్నిసార్లు ప్రయత్నించినా అతనిని కలవడం కుదర్లేదని వెల్లడించాడు. అందుకే అతనిపై ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నాడు. ఈ క్రమంలోనే 2014లో సుల్తాన్‌పూర్ నుంచి వరుణ్ గాంధీకి ప్రత్యర్థిగా బరిలోకి దిగానని చెప్పాడు. మహర్షి దయానంద్ యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ చేసిన వరుణ్ గాంధీ రెవాడీలో ఒక హోటల్‌ను నడుపుతున్నారు.

ఇదిలా ఉంటే ఏపీలో కూడా ఇదే జరిగితే కేఏ పాల్ పార్టీ తరుపున నిలబడ్డ అనేకమంది అభ్యర్ధుల వల్ల ప్రధాన పార్టీలలోని అభ్యర్ధులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also : కర్నూలులో ఉద్రిక్తత : వైసీపీ ప్రచారాన్ని అడ్డుకున్న తెలుగు తమ్ముళ్లు