Oldest Tortoise: గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన 190 ఏళ్ల తాబేలు

ప్రస్తుతం భూమిపై జీవించి ఉన్న అత్యంత పురాతనమైన తాబేలు వయసు 190 ఏళ్లు. "జోనాథన్" గా నామకరణం చేయబడ్డ ఈ తాబేలు ఈ ఏడాది 190 ఏళ్ళు పూర్తి చేసుకోనుంది.

Oldest Tortoise: గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన 190 ఏళ్ల తాబేలు

Tortoise

Oldest Tortoise: ప్రస్తుతం భూమిపై మనుషుల ఆయుష్షు సరాసరిగా 75-90 మధ్య ఉంది. వైద్యరంగంలో జరుగుతున్న పరిశోధనల ఆధారంగా భవిష్యత్తులో ఇది తగ్గొచ్చు లేదా పెరగొచ్చు. జంతువుల ఆయు ప్రమాణాల్లో మార్పు ఉండదు. కానీ నేల పై జీవిస్తున్న జీవుల్లో అత్యధిక జీవన కాలం కలిగిన జంతువు ఏదంటే “తాబేలు” అని టక్కున చెప్పేస్తాం. ఇప్పటివరకు జరిపిన పరిశోధనల ప్రకారం నేల పై జీవించే జీవులలో అత్యధిక జీవన కాలం కలిగిన జంతువూ తాబేలు కాగా..పురాతన తాబేలుని చూసిన వారు అతికొద్ది మందే ఉన్నారు. ప్రస్తుతం భూమిపై జీవించి ఉన్న అత్యంత పురాతనమైన తాబేలు వయసు 190 ఏళ్లు. “జోనాథన్” గా నామకరణం చేయబడ్డ ఈ తాబేలు ఈ ఏడాది 190 ఏళ్ళు పూర్తి చేసుకోనుంది. దీంతో ఈ తాబేలు.. నేలపై అత్యధిక కాలం జీవించి ఉన్న జీవిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది.

Also read: Covid Danger: ఆ జీన్ ఉన్న 27 శాతం మంది భారతీయులకు కరోనా పెనుముప్పు

హిందూమహా సముద్రంలోని సీషెల్స్ అనే దీవిలో 1832లో మొట్టమొదటిసారిగా ఈ జోనాథన్ తాబేలును గుర్తించారు. అక్కడి నుంచి ఈ తాబేలును 1882లో బ్రిటిష్ విదేశీ భూభాగమైనా సెయింట్ హెలెనా దీవికి తీసుకొచ్చారు. అక్కడే దీనికి జోనాథన్ గా పేరుపెట్టారు. అల్డాబ్రా అనే భారీ తాబేలు జాతికే ఉపజాతిగా చెప్పబడే ఈజాతి తాబేళ్లు చాలా కాలం క్రితమే అంతరించిపోయే దశలో ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఈ జాతి తాబేళ్ల సంఖ్య 80 మాత్రమే ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దాదాపు ప్యారిస్ నగరంలోని ఈఫిల్ టవర్ కంటే ఎక్కువ వయసున్న ఈ జోనాథన్ తాబేలు.. రెండు భారీ ప్రపంచ యుద్ధాలు, 1930 తీవ్ర మాంద్యం, అతి భయానక స్పానిష్ ఫ్లూ, సహా ప్రస్తుత కరోనా మహమ్మారి వంటి ఎన్నో విషయాలకు సాక్షిగా నిలిచింది.

Also read: Six Air Bags: వాహనాల్లో 6 ఎయిర్ బ్యాగులు తప్పనిసరి చేసిన కేంద్రం

కాగా ఈ జాతి తాబేళ్లు 150 సంవత్సరాల సరాసరి కాలం జీవిస్తుండగా.. జోనాథన్ అంతకు మించి జీవించడం ఆశ్చర్యకరమైన విషయం. ప్రస్తుతం సెయింట్ హెలెనా ద్వీపంలో వైద్యులు, జంతు సంరక్షకుల పర్యవేక్షణలో జీవిస్తున్న ఈ తాబేలు.. క్యాబేజీ, దోసకాయ, క్యారెట్, ఆపిల్ మరియు ఇతర కాలానుగుణ పండ్లను ఇష్టంగా తింటుంది. ఇక వృద్ధాప్యంలో వచ్చే అన్ని సమస్యలు జోనాథన్ ను చుట్టుముట్టాయని అయినా జీవించి ఉండడం ఆశ్చర్యంగా ఉందని జోనాథన్ ను పర్యవేక్షిస్తున్న వైద్యులు తెలిపారు.

Also read: Flight Accident: దుబాయ్ రన్ వే పై ఎదురెదురుగా విమానాలు, తృటిలో తప్పిన ప్రమాదం