Delhi Pollution : ఢిల్లీ కాలుష్యంపై విచారణ..ప్రపంచానికి ఏం సంకేతాలు పంపుతున్నామో ఆలోచించండీ : సుప్రీంకోర్టు

ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం గురించి ఏం సంకేతాలు పంపుతున్నామో ఆలోచించండీ..చర్చలు తీసుకుంటున్నాం అంటూ కాలయాపన చేయకుండా తగిన చర్యలు వెంటనే తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది.

10TV Telugu News

Delhi Pollution దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యంపై సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆదిత్య దుబే అనే 17 సంవత్సరాల విద్యార్థి వేసిన పిటీషన్‌పై విచారణ చేపట్టిన సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఇప్పటికే పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇంట్లో కూడా మాస్కులు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉందని..కాలుష్య కట్టడికి ఏం చర్యలుతీసుకుంటున్నారు? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ధర్మాసనం.

ఈక్రమంలో సుప్రీం కోర్టు బుధవారం ఢిల్లీ వాయి కాలుష్యంపై విచారణ జరిపింది. కాలుష్యం కారణంగా ఢిల్లీలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌ ధర్మాసనం విచారించింది. దేశ రాజధానిలో కాలుష్యం నియంత్రణకు ఎన్‌సీఆర్‌ పరిధిలోని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం మరికొన్ని రోజులు చర్యలు చేపట్టాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. తాత్కాలిక చర్యలు కాకుండా శాశ్వతంగా కాలుష్య నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

Read more : Govt scrapage policy : పాత వాహనాలను స్క్రాప్ కు ఇస్తే..కొత్త వాహనాలకు రాయితీ : కేంద్రం

కాలుష్య నివారణకు ముందస్తు చర్యలు అవసరమని ధర్మాసనం అభిప్రాయపడింది. దేశ రాజధానికి సంబంధించి.. మనం ప్రపంచానికి ఎలాంటి సంకేతాలు పంపుతున్నామో ఆలోచించాలని సూచించింది. కాలుష్య నివారణకు చేపట్టే ముందస్తు చర్యలు శాస్త్రీయ విధానంతో పక్కా ప్లాన్ తో ఉండాలని ధర్మాసనం పేర్కొన్నది. పారిశ్రామిక, థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు, వాహనాలు, ధుమ్ము, డీజిల్‌ జనరేట్ల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించాలని..కమిషన్‌ ఫర్‌ ఎయిర్‌ కాల్విటీ మేనేజ్‌మెంట్ సూచించిందని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు గుర్తు చేసింది.

కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా.. గాలి నాణ్యత మెరుగుపడుతుందని భావిస్తున్నామని ధర్మాసనానికి తెలియజేశారు. ప్రజా రవాణాను ప్రోత్సహించేందుకు కేంద్ర ఉద్యోగులకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారని..మూడు రోజుల తర్వాత పరిస్థితిని సమీక్షిస్తామని కోర్టుకు విన్నవించారు. ఈ క్రమంలో మరో రెండు మూడు రోజులు కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. ఈ లోపు కాలుష్య స్థాయి తగ్గితే పలు నిబంధనలు సడలించవచ్చని..పరిస్థితి ఇలాగే కొనసాగితే పలు సమస్యలు తప్పవని..ఈ కేసును మాత్రం మూసివేయకుండా విచారణ కొనసాగిస్తామని కాలుష్య నియంత్రణకు శాశ్వత చర్యలు తీసుకోవాలని కేంద్రానికి కోర్టు స్పష్టం చేసింది. సీజన్లను బట్టి విధానాలు మార్చుకుంటు కాలుష్యన్ని నియంత్రించాల్సిందేనని తెలిపింది.

Read more : Delhi Air Quality Index : ఢిల్లీలో తగ్గిన వాయుకాలుష్యం-29 నుంచి స్కూళ్లు ప్రారంభం

పంట వ్యర్థాల దహనం సమస్యను ఎలా పరిష్కరించబోతున్నారని ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. దానికి జనరల్‌ తుషార్‌ మెహతా సమాధానమిస్తు..నిపుణులతో కలిసి గ్రామాలకు వెళ్లి రైతులను కలిసి వారితో చర్చిస్తామని తీసుకోవాల్సిన చర్యల గురించి వివరిస్తామని తెలిపారు. కేవలం చర్చలతో కాలయాపన చేయకుండా వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది కోర్టు. పంట వ్యర్థాల దహనంపై ఇన్ని సంవత్సరాలుగా ప్రధాన కార్యదర్శులు, అధికారులు ఏం చేస్తున్నారని కోర్టు ప్రశ్నించింది.కాగా వాయు కాలుష్యంపై సుప్రీం కోర్టులో వాదనలు పలు కీలక అంశాలు లేవనెత్తుతు కొనసాగుతున్నాయి. కాలుష్యంపై విచారణలు జరగటం వరుసగా ఇది మూడో వారం కాగా..ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది.