S Jaishankar: కృష్ణుడు, హనుమంతుడు ప్రపంచంలోనే గొప్ప దౌత్యవేత్తలు: కేంద్ర మంత్రి జైశంకర్

కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్.. తాను రాసిన ‘ద ఇండియా వే:స్ట్రాటజీస్ ఫర్ యన్ అన్‌సర్టైన్ వరల్డ్’ అనే పుస్తకావిష్కరణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రామాయణం, మహాభారతం పాత్ర గురించి ప్రస్తావించారు. అలాగే విదేశీ పత్రికలపై కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

S Jaishankar: కృష్ణుడు, హనుమంతుడు ప్రపంచంలోనే గొప్ప దౌత్యవేత్తలు: కేంద్ర మంత్రి జైశంకర్

S Jaishankar: శ్రీ కృష్ణుడు, హనుమంతుడు ప్రపంచంలోనే గొప్ప దౌత్యవేత్తలని అభిప్రాయపడ్డారు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్. ఆయన రాసిన ‘ద ఇండియా వే:స్ట్రాటజీస్ ఫర్ యన్ అన్‌సర్టైన్ వరల్డ్’ అనే పుస్తకావిష్కరణ సందర్భంగా జై శంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Gujarat: పంచాయత్ జూనియర్ క్లర్క్ ఎగ్జామ్ పేపర్ లీక్.. పరీక్ష రద్దు చేసిన ప్రభుత్వం

ఈ సందర్భంగా దౌత్య వ్యవహారాల విషయంలో రామాయణం, మహాభారతం పాత్ర గురించి ప్రస్తావించారు. అలాగే విదేశీ పత్రికలపై కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రపంచంలోనే శ్రీ కృష్ణుడు, హనుమంతుడిని మించిన దౌత్యవేత్తలు లేరు. హనుమంతుడు లంకలో ఉన్న సీతాదేవిని కలిశాడు. లంకను దహనం చేశాడు. శ్రీ కృష్ణుడు అత్యుత్తమ దౌత్యవేత్త. ఆయన శిశుపాలుడికి వంద తప్పులు చేసేంత వరకు ఏమీ చేయనని హామీ ఇచ్చాడు. తర్వాత చెప్పినట్లుగానే వంద తప్పులు పూర్తయ్యాకే సంహరించాడు. సరైన నిర్ణయం తీసుకునే వ్యక్తుల లక్షణం అలానే ఉంటుంది’’ అని జై శంకర్ వ్యాఖ్యానించారు.

Pakistan: పాక్‌లో బోటు ప్రమాదం.. విహార యాత్రకు వెళ్లిన పది మంది చిన్నారులు మృతి

అలాగే విదేశీ పత్రికల వ్యవహార శైలిపై ఆయన విమర్శలు చేశారు. ‘‘విదేశీ పత్రికలు ఇండియాకు సంబంధించి ‘హిందూ జాతీయవాద ప్రభుత్వం’గా చిత్రీకరిస్తాయి. కానీ, అమెరికా, యూరప్‌లను మాత్రం ‘క్రైస్తవ జాతీయవాద దేశాలు’ అని మాత్రం రాయలేవు. ఇలాంటి పదాల్ని పత్రికలు మన కోసం మాత్రం వాడుతుంటాయి. ఆ పత్రికలకు ప్రపంచానికి భారత్ చేస్తున్న దాని గురించి ఆలోచించవు. మన జాతీయ భావాల విషయంలో తప్పేంలేదు. క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి కూడా లేదు. తొమ్మిదేళ్లుగా మన ప్రభుత్వం చేస్తున్నవన్నీ జాతీయవాద దృక్పథంతోనే ఉన్నాయి. మన జాతీయ భావాలు కలిగిన వాళ్లే ప్రపంచంలోని అనేక దేశాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు’’ అని జైశంకర్ వ్యాఖ్యానించారు.