కృష్ణుడే కరోనాను భూమ్మీదకు పంపించాడు..కృష్ణా..కరోనా ‘క’తో మొదలవుతాయి: కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు

  • Published By: nagamani ,Published On : June 30, 2020 / 12:12 PM IST
కృష్ణుడే కరోనాను భూమ్మీదకు పంపించాడు..కృష్ణా..కరోనా ‘క’తో మొదలవుతాయి: కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు

కరోనా వైరస్(కోవిడ్ 19) వైరస్ ఎలా వచ్చిందన్నదనే అంశంపై దేశాలకు దేశాలే పలు రకాలుగా అభిప్రాయపడుతున్నారు. దీనిపై ఇంతవరకూ సైంటిస్టులు కూడా సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత మాత్రం తనదైన శైలిలో మరో అడుగు ముందుకేసి ‘‘శ్రీకృష్ణుడే కరోనాను మనుషులపైకి వదిలాడని’’ వ్యాఖ్యానించారు.

కరోనా వైరస్ గబ్బిలాల వల్ల అనికొందరు..కాదు పందుల ద్వారా వచ్చిందని మరికొందరు, కాదు ఇది పాత వైరస్సే రూపు మార్చుకుని కరోనాగా తయారైందరి ఇంకొందరు చెబుతున్నారు. మరోపక్క ఇంకొంతమంది ఇది కలికాలం, కరోనాతోనే యుగాంతమని..కరోనా మహమ్మారి గురించి కాలజ్ఞానంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మం ఎప్పుడో చెప్పారని కొందరు ఎవరికి తోచింది వాళ్లు అంటున్నారు.

ఈక్రమంలో ఓ ఉత్తరాఖండ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సూర్యకాంత్‌ దస్మానా ఈ మతిపోయే వ్యాఖ్యలు చేస్తూ..‘‘శ్రీకృష్ణభగవానుడే లోకంపైకి ఈ వ్యాధిని పంపాడని’’ అంటున్నారు. దీనికి ప్రథమాక్షర సిద్ధాంతాన్ని కూడా చెప్పుకొచ్చారాయన. ‘కరోనా వైరస్‌, కృష్ణ అనే రెండు పదాలతోనే ‘క’ శబ్దంతో మొదలవుతాయి. అందుకే దీన్ని కృష్ణుడే మనపై వదిలాడు’ అని సూర్యకాంత్ దస్మానా ఓ కార్యక్రమంలో అన్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ నేతలకు హిందూ దేవతలను ఆడిపోసుకోవడం తప్ప మరో పనిలేదని, కాంగ్రెస్ పార్టీ పేరు కూడా ‘క’అనే అక్షరంతోనే మొదలవుతుందని సెటైర్లు వేస్తున్నారు.

Read:సెలబ్రిటీల టిక్‌టాక్ అకౌంట్లపై నీలి నీడలు..