Farooq Abdullah : రాముడు అందరికీ దేవుడే.. బీజేపీ మాత్రం రాజకీయం కోసమే రాముడ్ని వాడుకుంటోంది: ఫరూఖ్ అబ్దుల్లా

బీజేపీపై నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, జమ్ము కశ్మీర్మా మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా విమర్శలు సంధించారు. బీజేపీ రాముడ్ని రాజకీయం కోసమే వాడుకుంటోందని..రాముడు బీజేపీకి మాత్రమే దేవుడు కాదు అందరికి దేవుడే అంటూ వ్యాఖ్యానించారు.

Lord Sri Rama : శ్రీరాముడి (Lord Sri Rama) మంత్రం జపించే బీజేపీ (BJO)పై నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత (Nationalist Congress chief ), జమ్ము కశ్మీర్ (Jammu and Kashmir) మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా (Farooq Abdullah) విమర్శలు సంధించారు. గురువారం (మార్చి23,2023) జమ్మూకశ్మీర్ లోని ఉధంపూర్ (Udhampur)లో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడుతూ..బీజేపీ రాముడ్ని రాజకీయం కోసమే వాడుకుంటోందని.. రాముడు బీజేపీకి మాత్రమే దేవుడు కాదు అందరికి దేవుడే అంటూ వ్యాఖ్యానించారు. శ్రీరాముడు మతంతో సంబంధం లేకుండా ఆయనపై నమ్మకం ఉంచే ప్రతీ ఒక్కరికి దేవుడేనని అన్నారు. కానీ అటువంటి రాముడిని బీజేపీ తన రాజకీయం కోసం వాడుకోవటం దౌర్భాగ్యమని.. రాముడు హిందువులకు మాత్రమే కాదు అందరికి దేవుడేనని అన్నారు.

బీజేపీ తన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని, రాముడ్ని రాజకీయం చేయటం మానుకోవాలని సూచించారు. ముస్లింలు, క్రిస్టియన్లు, అమెరికన్లు, రష్యన్లు.. ఇలా రాముడ్ని ఎవరు నమ్మినా వారందరికి ఆయన దేవుడేనని.. మేం రామ భక్తులమని చెప్పుకునేవారు నిజమైన భక్తులు కాదంటూ బీజేపీకి చురకలు వేశారు ఫరూఖ్ అబ్దుల్లా. బీజేపీకి రాముడిపై నిజమైన ప్రేమ లేదని కేవలం రాజకీయం కోసమే రాముడి పేరును వాడుకుని లబ్ది పొందుతోందన్నారు. రాముడి పేరుతో బీజేపీ ప్రజల మధ్య అంతరాలను పెంచుతు విద్వేషాలను రెచ్చగొడుతోందని విమర్శించారు. ఇకనైనా బీజేపీ ఇటువంటి రెచ్చగొట్టుడు విధానాలు మానుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నానని ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు.

అలాగే బీజేపీ యేతర పార్టీల ఐకమత్యం విషయంలో మీడియా అడిగిన ప్రశ్నలకు ఫరూఖ్ అబ్దుల్లా సమాధానమిస్తూ… తమ ఐక్యతకు ఎటువంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. తాము ప్రజల కోసమే పోరాడుతాం.. ప్రజల కోసమే చనిపోతామని అన్నారు. ఎలాక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లతో ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Also Read: ఒడిశా ముఖ్యమంత్రిని కలిసిన మమతా బెనర్జీ.. ఫ్రంట్‭లో పట్నాయక్ చేరతారా?

ట్రెండింగ్ వార్తలు