Love Fail : తెల్లారితే పెళ్లిచూపులు.. ఇంతలోనే ఆత్మహత్య
ప్రేమ విఫలం కావడంతో జిమ్ ట్రైనర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. ఈ ఘటన బెంగళూరులోని రాజరాజేశ్వరినగర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
Love Fail : ప్రేమ విఫలం కావడంతో జిమ్ ట్రైనర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. ఈ ఘటన బెంగళూరులోని రాజరాజేశ్వరినగర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మారప్ప లేఔట్‌కు చెందిన కార్తీక్ (29) జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. మూడేళ్ళుగా ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు కార్తీక్. అయితే ఈ మధ్య ఆమె కార్తీక్‌ను దూరం పెడుతూ వచ్చింది. ఫోన్ చేసినా తీయకపోవడంతో ఆమెను కలిసేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు. కార్తీక్‌తో మాట్లాడేందుకు ఒప్పుకోలేదు.
చదవండి : Love : పెళ్లికి నిరాకరించిన ప్రియుడు.. మనస్తాపంతో యువతి ఆత్మహత్య
ప్రేమించిన యువతి మోసం చేసిందన్న విషయం కార్తీక్ తల్లిదండ్రులకు తెలియడంతో వారు వేరే సంబంధం చూశారు. ఆదివారం పెళ్లి సంబంధానికి వెళ్లాల్సి ఉండగా శనివారం రాత్రి తన ప్రేమ విఫలం గురించి సెల్ఫీ వీడియో తీసుకోని షీట్ హ్యాంగర్‌కు ఉరివేసుకున్నాడు . తన ప్రేయసి దూరం కావడంతో తనకు ఏమి తోచడం లేదని.. అందుకే ఈ విధంగా చేస్తున్నానని తెలిపాడు. కార్తీక్ తల్లిదండ్రులు కూడా ఇదే విషయం తెలిపారు. ప్రేమ విఫలం కావడం వల్లనే తమ కుమారుడు మరణించారని పేర్కొన్నారు.
చదవండి : Love : ప్రేమ వ్యవహారం.. ట్రైనీ ఐఏఎస్‌పై కూకట్పల్లి పీఎస్‌లో కేసు నమోదు