AAP on Modi Govt: ‘మోదీ ప్రభుత్వ ఫేవరేట్ ఏజెన్సీ నుంచి లవ్ లెటర్ వచ్చింది’

అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో కొనసాగుతున్న ఆప్ పార్టీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ నుంచి నోటీస్ వచ్చింది. ఢిల్లీలో అధికార పార్టీ అయిన ఆప్ కు నోటీసు రావడాన్ని..

AAP on Modi Govt: ‘మోదీ ప్రభుత్వ ఫేవరేట్ ఏజెన్సీ నుంచి లవ్ లెటర్ వచ్చింది’

Aap On Modi Govt

AAP on Modi Govt: అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో కొనసాగుతున్న ఆప్ పార్టీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ నుంచి నోటీస్ వచ్చింది. ఢిల్లీలో అధికార పార్టీ అయిన ఆప్ కు నోటీసు రావడాన్ని ‘మోడీ గవర్నమెంట్ ఫేవరేట్ ఏజెన్సీ నుంచి నోటీస్ పొందినట్లుగా’ పేర్కొంది. ప్రెస్ కాన్ఫిరెన్స్ లో మాట్లాడిన అధికార ప్రతినిధి రాఘవ్.. పార్టీ నేషనల్ సెక్రటరీ పంకజ్ గుప్తాకు ఈడీ నోటీస్ పంపినట్లు తెలిపారు.

మనీలాండరింగ్ నిరోధ చట్టం కింద అతణ్ని ప్రశ్నిస్తూ.. పంపిన నోటీసుకు సెప్టెంబర్ 22కల్లా బదులివ్వాలని అందులో ఉంది.

బీజేపీ ఓట్లతో ఆప్‌ను ఆపలేకపోయింది. కాబట్టే వ్యక్తిత్వాన్ని కోల్పోయి ఎదుర్కొనేందుకు యత్నిస్తుంది. ఈ క్రమంలోనే మోదీ ఫేవరేట్ ఏజెన్సీ సర్వీస్ చేస్తున్నట్లుగా ఆమ్ ఆద్మీ పార్టీకి లవ్ లెటర్ పంపించింది’ అని రాఘవ్ చద్దా అన్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్, గోవా, ఉత్తరాఖాండ్, గుజరాత్ లో ఎదుగుదలను చూసి భయపడిన మోదీ ప్రభుత్వం ఇలాంటి వాటికి పాల్పడుతుందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ప్రత్యర్థులపై దాడి చేసేందుకు కేంద్ర బలగాలైన సీబీఐ, ఈడీలను వాడుకుంటుందంటూ ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తూనే ఉన్నాయి.

Read Also: NEET : ‘నీట్’ కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం

ఆప్ వచ్చే ఏడాది జరగబోయే పంజాబ్, ఉత్తరప్రదేవ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా బరిలోకి దిగుతుంది.