పబ్ జి లవ్ : ప్రియుడిని చూసేందుకు వెళ్లిన పెళ్లైన మహిళ, తర్వాత షాక్

పబ్ జి లవ్ : ప్రియుడిని చూసేందుకు వెళ్లిన పెళ్లైన మహిళ, తర్వాత షాక్

PUBG

PUBG : పబ్ జి ద్వారా పరిచయమైన వ్యక్తితో పెళ్లైన మహిళ పరిచయం పెట్టుకుంది. అతనిని ప్రేమించసాగింది. అతడిని కలిసేందుకు బయలుదేరింది. కానీ..తీరా అక్కడకు వెళ్లిన తర్వాత..ఆ మహిళ షాక్ తింది. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పబ్ జి గేమ్..,చిన్నా..పెద్దా అనే తేడా లేకుండా..ఆడుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. ప్రస్తుతం దీనిని బ్యాన్ చేశారు.

కంగ్రాకు చెందిన వివాహితకు ఓ వ్యక్తితో పబ్ జి ద్వారా పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా..ప్రేమగా మారింది. ఇతను యూపీకి చెందిన వాడు. అతడిని కలిసేందుకు..ఇంట్లో ఎవరికీ చెప్పకుండా..బయలుదేరింది. మహిళ కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. పలు ప్రాంతాల్లో వెతికారు.

ఫలితం దక్కలేదు. మరోవైపు..యూపీకి చేరుకున్న తర్వాత..ఆమెకు షాక్ తగిలింది. తాను పరిచయం పెట్టుకుంది..క్లోజ్ గా మాట్లాడింది..12వ తరగతి చదువుతున్న యువకుడితో అని తెలుసుకున్న ఆ మహిళ షాక్ కు గురైంది. తాను చేసిన తప్పేంటో తెలుసుకుంది. ఇంటికి వెళ్లాలని అనుకుంది. జరిగిన విషయాన్ని కుటుంసభ్యులకు తెలియచేసింది. ఇంటికి తీసుకెళ్లాలని కోరింది. ఈ విషయాన్ని పోలీసులకు తెలియచేశారు. ఆమె ఎక్కడుందో తెలుసుకుని..మహిళను కుటుంబసభ్యులకు అప్పగించారు.