ఇండియాలో తగ్గిన బంగారం ధరలు.. పెరిగిన కొనుగోలు డిమాండ్!

ఇండియాలో తగ్గిన బంగారం ధరలు.. పెరిగిన కొనుగోలు డిమాండ్!

Low gold prices : భారతదేశంలో ఫిజికల్ గోల్డ్ డిమాండ్ ఊపందుకుంది. గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకి రూ.46,000 వద్ద ట్రేడవుతున్నాయి. గత వారం రూ.45,861 తాకిన బంగారం ధర ఎనిమిది నెలల పతనానికి చేరువలో స్థిరపడింది. ప్రస్తుత బంగారం ధరలు తగ్గడంతో వినియోగదారులు కొనుగోలుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. రిటైల్ కొనుగోలుదారుల నుంచి ఆభరణాలకు మంచి డిమాండ్ ఉందని కోల్‌కతా రిటైల్ వ్యాపారి హర్షద్ అజ్మెరా అభిప్రాయపడ్డారు.

అధికారిక దేశీయ ధరలపై ఔన్సుకు సుమారు 4 డాలర్లు ప్రీమియాన్ని డీలర్లు వసూలు చేశారు. ఇందులో 12.5శాతం ​​దిగుమతి, 3శాతం అమ్మకపు లెవీలు ఉన్నాయి. గత వారం 7 డాలర్ల ప్రీమియంతో పోలిస్తే ఎనిమిది నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. సింగపూర్‌లో ఔన్స్‌కు 1.4- 2 డాలర్ల ప్రీమియంలు వసూలు అయ్యాయి. గ్లోబల్ మార్కెట్లో ఫిజికల్ గోల్డ్ కొరత కారణంగా బంగారం, వెండి డెలివరీలు ఆలస్యానికి కారణమైందని సింగపూర్ మరో డీలర్ సిల్వర్ విన్సెంట్ టై చెప్పారు.

కోవిడ్ ఆంక్షలతో మార్కెట్ కార్యకలాపాలు తగ్గి హాంకాంగ్ ద్వారా చైనా నికర బంగారం దిగుమతులు జనవరిలో భారీగా పడిపోయాయి. హాంకాంగ్‌లో, డీలర్లు బెంచ్‌మార్క్‌తో సమానంగా 1 ప్రీమియంతో బులియన్‌ను విక్రయించారు. జపనీస్ డీలర్లు 0.50 డాలర్ల ప్రీమియం వసూలు చేశారు.