ఉత్తరాఖండ్ జలవిలయం : తన వాళ్ల కోసం కుక్క ఎదురు చూపులు

ఉత్తరాఖండ్ జలవిలయం : తన వాళ్ల కోసం కుక్క ఎదురు చూపులు

Tapovan tunnel waiting for men he knew : ఉత్తరాఖండ్ జలవిలయం ఘటన ఇంకా మరిచిపోవడం లేదు. దాదాపు 25 నుంచి 35 మంది దాక సొరంగంలో ఇరుక్కపోయారు. ఇందులో కొంతమందిని రెస్క్యూ టీం రక్షించగా..మరికొంతమంది ప్రాణాలు కోల్పోయారు. అయితే..ఓ కుక్కను చూస్తే..మాత్రం అందరికీ జాలి కలుగుతోంది. ఘటన జరిగిన ప్రాంతం వద్దకు రావడం..అక్కడున్న సిబ్బంది తరిమికొట్టడం..మళ్లీ రావడం చేస్తోంది ఆ కుక్క. అసలు ఎందుకు ఇలా చేస్తోంది తెలుసుకున్న వారు..కళ్లు చెమర్చుతున్నాయి.

Tapovan tunnel

తపోవన్ విష్ణుగాడ్ హైడ్రోపవర్ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. ఇక్కడ ఎంతో మంది పని చేసే వారు. ప్రాజెక్టు వద్ద భుటియా జాతికి చెందిన రెండు సంవత్సరాలున్న నల్ల కుక్క ఇక్కడే ఉండేది. వారు పెట్టే ఆహారం తింటూ..సంచరించేది. ప్రమాదం జరిగిన ఆదివారం రోజు..ఆ ప్రాంతంలో కాకుండా..కిందనున్న వేరే ప్రాంతానికి తిరిగి వెళ్లింది. ఆ తర్వాత వరద ముంచెత్తింది. అక్కడ పని చేస్తున్న వారు నీటిలో కొట్టుకపోగా…మరికొంతమంది సొరంగంలో చిక్కుకపోయారు. తెల్లారి..అక్కడకు నల్లకుక్క వచ్చింది. తనకు తెలిసిన వారు ఎవరూ కనిపించడం లేదు.

disaster

సహాయక చర్యలు చేపడుతున్న వారు ఆ కుక్కను తరిమారు. కానీ..మళ్లీ అక్కడకు వచ్చేది. ఇలా ప్రతిసారి దానిని తరిమేయటం..మళ్లీ మళ్లీ అక్కడకు వచ్చేది. కొందరు వ్యక్తులు నల్లకుక్క గురించి చెప్పారు. చాలాసార్లు దీనిని ఇక్కడే చూశామని, అసలు విషయం చెప్పారు. దీంతో సహాయక సిబ్బంది దానికి తినడానికి తిండి పెడుతూ, రాత్రిళ్లు పడుకోవడానికి గోనె సంచి ఏర్పాటు చేశారు. తనకు తిండి పెట్టిన వాళ్లు ఎప్పుడైనా వస్తారని ఆ కుక్క ఎదురు చూస్తోంది.