26 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన సుమిత్రా మహాజన్ 

  • Published By: chvmurthy ,Published On : January 2, 2019 / 03:09 PM IST
26 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన సుమిత్రా మహాజన్ 

ఢిల్లీ: సభా కార్యక్రమాలకు ఆటంకం కల్గిస్తున్నారనే కారణంతో 26 మంది అన్నా డీఎంకే ఎంపీలను లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ ఐదు రోజులపాటు సస్పెండ్ చేశారు. కావేరీ నదిపై కర్ణాటకలో మేకదాటు ఆనకట్టను నిర్మించాలని ప్రతిపాదించడంపై అన్నా డీఎంకే ఎంపీలు తీవ్ర నిరసన  తెలుపుతూ లోక్‌సభ వెల్‌లోకి ప్రవేశించి, నినాదాలు చేశారు. చీటికి, మాటికి సభా కార్యక్రమాలకు  ఎంపీలు అడ్డు తగలటంతో వరుసగా ఐదు రోజుల పాటు లోక్‌సభ సమావేశాల్లో పాల్గొనకుండా సస్పెండ్ చేశారు.
త్వరలో కర్ణాటకలో వచ్చే ఎన్నికల్లో  లబ్దిపొంది, సీట్లు గెలవటానికే బీజేపీ ప్రభుత్వం కర్ణాటకలో మేకదాటు ఆనకట్ట నిర్మాణానికి అనుమతిచ్చిందని అన్నా డీఎంకే తంబిదురై  అన్నారు. ప్రభుత్వం నిరసన తెలిపే హ్కకును కూడా హరించి వేస్తోందని ఆయన  ఆరోపించారు.