New CDS Of India: నూతన సీడీఎస్‌గా అనిల్ చౌహాన్.. తొమ్మిది నెలల తరువాత పదవిని భర్తీ చేసిన కేంద్రం..

రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్‌ను తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా కేంద్రం ఎంపిక చేసింది. బిపిన్ రావత్ మరణం తర్వాత సైనిక అత్యున్నత పదవికి ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై కేంద్రం సుదీర్ఘంగా కసరత్తు చేసిన అనంతరం చౌహాన్‌ను ఎంపిక చేసింది.

New CDS Of India: నూతన సీడీఎస్‌గా అనిల్ చౌహాన్.. తొమ్మిది నెలల తరువాత పదవిని భర్తీ చేసిన కేంద్రం..

Anil Chauhan

New CDS Of India: రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్‌ను తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్)గా కేంద్రం ఎంపిక చేసింది. బిపిన్ రావత్ మరణం తర్వాత సైనిక అత్యున్నత పదవికి ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై కేంద్రం సుదీర్ఘంగా కసరత్తు చేసిన అనంతరం చౌహాన్‌ను ఎంపిక చేసింది. దాదాపు 40 ఏళ్లు వివిధ హోదాల్లో ఇండియన్ ఆర్మీలో చౌహాన్ పనిచేశారు. ముఖ్యంగా జమ్మూ & కాశ్మీర్, ఈశాన్య భారతదేశంలో తిరుగుబాటు నిరోధక కార్యకలాపాలలో విస్తృతమైన అనుభవం కలిగి ఉన్నాడని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

Congress President Election: కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో దిగ్విజయ్ సింగ్ పేరు.. ఆయన ఏమన్నారంటే?

1961 మే 18న లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ జన్మించారు. 1981లో భారత సైన్యంలోని 11 గూర్ఖా రైఫిల్స్‌లోకి ప్రవేశించారు. అతను నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఖడక్వాస్లా, ఇండియన్ మిలిటరీ అకాడమీ, డెహ్రాడూన్ పూర్వ విద్యార్థి. మేజ్ జనరల్ హోదాలో, అధికారి నార్తర్న్ కమాండ్‌లోని క్లిష్టమైన బారాముల సెక్టార్‌లో పదాతిదళ విభాగానికి నాయకత్వం వహించారు. తరువాత లెఫ్టినెంట్ జనరల్‌గా నార్త్ ఈస్ట్‌లో ఒక కార్ప్స్‌కి నాయకత్వం వహించాడు. సెప్టెంబర్ 2019 నుండి తూర్పు కమాండ్‌కి జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ అయ్యాడు. మే 2021లో సర్వీస్ నుండి పదవీ విరమణ చేసే వరకు బాధ్యతలు నిర్వహించారు. 2021 మే 31న ఈస్టర్న్ కమాండ్ చీఫ్ గా పదవీ విమరణ చేశారు.

Uttarakhand: ఒక్క రాత్రికి రూ. 500 చెల్లిస్తే చాలు.. మీరు నిజమైన జైలు జీవితాన్ని అనుభవించొచ్చు.. జాతకంలో దోషాలూ పోతాయట ..!

ఆర్మీ నుండి పదవీ విరమణ చేసిన తర్వాత కూడా అనిల్ చౌహాన్ జాతీయ భద్రత, వ్యూహాత్మక విషయాలలో తన సహకారం అందించారు. సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ (రిటైర్డ్) సేవలకు.. పరమ విశిష్ట సేవా పతకం, ఉత్తమ యుద్ధ సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, సేన పతకం, విశిష్ట సేవా పతకం పొందారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఇదిలాఉంటే హెలికాప్టర్ ప్రమాదంలో భారత తొలి సీడీఎస్ బిపిన్ రావత్ మరణించిన తొమ్మిది నెలల తర్వాత రెండో సీడీఎస్ గా అనిల్ చౌహాన్ ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. గతేడాది డిసెంబర్ లో తమిళనాడు కూనురు సమీపంలో నీలగిరి కొండల్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ మరణించారు. ప్రస్తుతం బిపిన్ స్థానంలో అనిల్ చౌహాన్ ను సీడీఎస్ గా కేంద్రం నియమించింది. అయితే, భారత దేశంలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సులను సమన్వయం చేసేందుకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవిని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చింది. భారత్ తొలి సీడీఎస్ గా బిపిన్ రావత్ ను నియమించింది.