charbagh railway station : రైల్వే స్టేషన్లలో కోతుల బీభత్సం..తరిమి కొట్టటానికి అధికారుల భలే ఐడియా

charbagh railway station : రైల్వే స్టేషన్లలో కోతుల బీభత్సం..తరిమి కొట్టటానికి అధికారుల భలే ఐడియా

Monkey Problem In Charbagh Railway Station

monkey Problem in charbagh railway station  : జనావాసాల మీదకు కోతురు విరుచుకుపడి నానా బీభత్సం చేస్తుంటాయి.అలాగే గుళ్ల దగ్గర..పర్యాటక ప్రదేశాల్లోను కోతులు మనుషుల దగ్గర ఉండే ఆహార పదార్ధాలను,,వాటర్ బాటిళ్లను ఎత్తుకుపోయి నానా బీభత్సం చేస్తుంటాయి. అలా యూపీలోని లక్నోలోని ఓ రైల్వే స్టేషన్ లో కొండముచ్చు కోతులు ప్రయాణీకులకు పెద్ద సమస్యగా మారాయి. ప్రయాణీకుల చేతుల్లో ఉండే ఆహార పదార్దాలతో పాటు వారి చేతుల్లో ఉండే వస్తువుల్నికూడా ఎత్తుకుపోతున్నాయి. దీంతో అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో అధికారులకు కొండముచ్చులు చేసే హంగామా పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో ఆలోచించీ ఆలోచించీ ఓ ఐడియా వేశారు. ఆ ఐడియా ఏంటంటే..

యూపీలోని లక్నో పరిధిలోగల చార్‌బాగ్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు కోతుల నుంచి భద్రత కోసం ఓ వ్యక్తిని నియమించారు. అతను కోతుల్ని కొట్టటానికి కాదు..అచ్చు కోతుల్లా అరవటానికి..!!అదేంటీ కోతుల బెడద నుంచి తప్పించుకోవటానికి కిస్మెట్ షా అనే యువకుడిని నియమించారు.

చార్‌బాగ్ రైల్వే స్టేషన్‌లో కోతులు ప్రతీరోజు నానా బీభత్సం సృష్టిస్తుంటాయి. ప్రయాణికులపై దాడి చేస్తూ, వారి దగ్గరున్న సమాను లాక్కొని వెళ్లిపోతుంటాయి. దీంతో రైల్వే అధికారులు కోతులను తరిమి కొట్టేందుకు కొండముచ్చులా అరిచే కిస్మెట్ షా అనే వ్యక్తిని స్టేషన్‌లో నియమించారు. కిస్మెట్ షాతన స్నేహితునితో పాటు కొండముచ్చు మాదిరిగా అరుస్తుంటాడు. రైల్వే అధికారులు చేసిన ఈ ప్రయోగం విజయవంతమైంది. ప్రయాణికులను కూడా కోతుల బాధ తప్పింది. కోతులు అస్సలు చార్‌బాగ్ రైల్వే స్టేషన్ వైపే రావటంలేదట..దీంతో అధికారులు లక్నో, అయోధ్య, ఫైజాబాద్, వారణాసి స్టేషన్లలో ఇలా కోతుల్లా అరిచే వ్యక్తుల్ని నియమించారు. నెలకు రూ .15 వేల కాంట్రాక్టుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కోతిలా అరిచే వ్యక్తి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ డ్యూటీ చేస్తారు.

కోతుల్ని తరిమి కొట్టే కిస్మెట్ షా లక్రోలోని తేలిబాగ్ కు చెందినవాడు. అతనికి గురు సోదరులున్నారు. అతను ఆయా ప్రాంతాల్లో కోతుల సమస్యలు ఉన్నవారు కిస్మెట్ షాను సంప్రదిస్తుంటారు.దీంతో అతను కోతుల్ని తరిమి కొట్టటాన్ని ఉపాధిగా మలచుకున్నాడు.ఎవరైనా కోతుల సమస్యలతో అతనినిక సంప్రదిస్తే అక్కడకు వెళ్లి కోతుల బెడదల్ని పారద్రోలి వస్తుంటాడు.దీంతో రైల్వే అధికారులు కూడా ఇతన్ని సంప్రదించారు. అలా కిస్మెట్ షా తన స్నేహితుడితో కలిసి నెలకు రూ.15 వేలు చొప్పున 6 నెలల పాటు చార్ బాగ్ రైల్వే స్టేషన్ లో కోతుల్ని కొట్టే పనికి కుదిరాడు.