Lucknow: యూపీ క్యాపిటల్ సిటీ పేరు మారుతోందా? ఇంతకీ అది లఖ్‭నవూ కాకుండా మరేంటి?

త్రేతాయుగంలో లక్ష్మణ్‌పూర్‌గా పిలిచేవారని ఆయన అన్నారు. నవబ్ అసఫ్-ఉద్-దౌలానే లఖ్‭నవూగా పేరు మార్చారని చెప్పారు. త్రేతాయుగంలో అయోధ్యా నగరాన్ని ఏలిన శ్రీరాముడు లక్నో సిటీని తన సోదరుడైన లక్ష్మణుడికి కానుకగా ఇచ్చాడని, ఆ కారణంగానే ఆ సిటీని లఖన్‌పూర్, లక్ష్మణ్‌పూర్‌ అని పిలిచేవారని వివరించారు

Lucknow: యూపీ క్యాపిటల్ సిటీ పేరు మారుతోందా? ఇంతకీ అది లఖ్‭నవూ కాకుండా మరేంటి?

Lucknow To Be Renamed? What Yogi Adityanath's Deputy Said

Lucknow: భారతీయ జనతా పార్టీ మీద పేరు మార్పుపై కొన్ని విమర్శలు ఉన్నాయి. అందునా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికైతే కాస్త పెద్ద స్థాయిలోనే ఉన్నాయి. రైల్వే స్టేషన్లు, నగరాలు, స్టేడియం.. ఇలా తదిరలా పేర్లను బీజేపీ ప్రభుత్వాలు మార్చాయి. వాస్తవానికి ఇది అన్ని పార్టీల ప్రభుత్వాల్లో కొనసాగే తంతే. కాకపోతే ఈ విషయంలో బీజేపీ మీద విమర్శలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికి ఉన్న వివాదాలకు తోడు ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ మరో వివాదానికి తెరలేపినట్టే కనిపిస్తోంది.

Subramanian Swamy: సొంత పార్టీని మరింత ఇరుకున పెట్టిన సుబ్రహ్మణ్య స్వామి.. అదానీ ఆస్తులపై సంచలన వ్యాఖ్యలు

ఉత్తరప్రదేశ్ రాజకీయ రాజధాని లఖ్‭నవూ పేరును మారుస్తామని ఆయన అన్నారు. వాస్తవానికి అది లఖ్‭నవూ కాదని, లక్ష్మణ్ సిటీ అని ఆయన వాదన. తాజాగా రాష్ట్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లఖ్‭నవూ పేరును ‘లక్ష్మణ్ నగర్’గా మార్చేందుకు తదుపరి చర్చలు జరుగుతున్నట్లు సంకేతాలివ్వడం గమనార్హం. బుధవారం బదోహిలో బ్రజేష్ పాఠక్ పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ పథకాలు, అభివృద్ధి పనుల ప్రగతిని సమీక్షించారు. దీన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. కొద్ది రోజుల క్రితం బీజేపీ ఎంపీ సంగమ్ లాల్ గుప్తా చేసిన డిమాండ్‌కు కొనసాగింపుగా ఆయన ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.

Mahua Moitra: పార్లమెంటులో బీజేపీ నేతపై అభ్యంతరకర పదం.. విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గనంటున్న మహువా

లఖ్‭నవూను లఖన్‌పూర్‌గా కానీ, లక్ష్మణ్‌పూర్‌గా కానీ మార్చాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను బీజేపీ ఎంపీ సంగమ్ లాల్ గుప్తా కోరారు. గతంలో దీనికి లఖన్‌పూర్ అనే పేరు ఉండేదని, త్రేతాయుగంలో లక్ష్మణ్‌పూర్‌గా పిలిచేవారని ఆయన అన్నారు. నవబ్ అసఫ్-ఉద్-దౌలానే లఖ్‭నవూగా పేరు మార్చారని చెప్పారు. త్రేతాయుగంలో అయోధ్యా నగరాన్ని ఏలిన శ్రీరాముడు లక్నో సిటీని తన సోదరుడైన లక్ష్మణుడికి కానుకగా ఇచ్చాడని, ఆ కారణంగానే ఆ సిటీని లఖన్‌పూర్, లక్ష్మణ్‌పూర్‌ అని పిలిచేవారని వివరించారు. ఈ మేరకు అమిత్‌షాకు ఒక లేఖ రాశారు. అమృత్ కాల్‌లో అయినా భవిష్యత్ తరాల వారికి భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని పదిలం చేసేందుకు చర్యలు తీసుకోవాలని అమిత్ షాకు రాసిన లేఖలో సంగమ్ లాల్ కోరారు.