Lucknow University: లక్నో యూనివర్సిటీలో వింత నిబంధన.. పది దాటితే క్యాంపస్‌లో తిరగొద్దట!

యూనివర్సిటీలు అనగానే విద్యార్థులకు కావాల్సినంత స్వేచ్ఛ ఉంటుంది అనుకుంటారు. కానీ, అప్పుడప్పుడూ వాటిలో కోత తప్పదు. లక్నో యూనివర్సిటీ విధించిన తాజా నిబంధనే దీనికి నిదర్శనం. అక్కడ రాత్రి పది గంటల తర్వాత క్యాంపస్‌లో తిరగడం చేయకూడదని నిబంధన విధించింది.

Lucknow University: లక్నో యూనివర్సిటీలో వింత నిబంధన.. పది దాటితే క్యాంపస్‌లో తిరగొద్దట!

Lucknow University: ఉత్తర ప్రదేశ్‌లోని లక్నో యూనివర్సిటీ తాజాగా విద్యార్థులకు వింత నిబంధన విధించింది. రాత్రి పది గంటల తర్వాత విద్యార్థులెవరూ యూనివర్సిటీ క్యాంపస్‌లో తిరగడం చేయకూడదని నిబంధన విధించింది. దీనిపై విద్యార్థులకు ఆదివారం ఒక నోటీస్ జారీ చేసింది.

Sachin Tendulkar: సచిన్.. సచిన్.. సచిన్.. విమానంలో హోరెత్తిన ఫ్యాన్స్ నినాదాలు.. ఎందుకంటే

ఈ నోటీస్ ప్రకారం.. లక్నో యూనివర్సిటీలోని ఉభయ క్యాంపస్ పరిధిలోని విద్యార్థులెవరూ రాత్రి పది గంటల తర్వాత క్యాంపస్‌లో తిరగకూడదు. అలాగే పది గంటల తర్వాత బయటకు వెళ్లడం కానీ, లేదా బయటి నుంచి లోపలికి రావడం కానీ నిషేధం. విద్యార్థినీ, విద్యార్థుల్లో ఎవరైనా ఈ నిబంధనల్ని ఉల్లంఘిస్తే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు. అయితే, ఉన్నట్లుండి యూనివర్సిటీ అధికారులు ఈ నిర్ణయం తీసుకోవడానికి ఒక కారణం ఉంది. గత శుక్రవారం అర్ధరాత్రి 01.30 గంటల సమయంలో కొందరు విద్యార్థులు క్యాంపస్ నుంచి బయటకు వెళ్లారు. టీ తాగడం కోసం బయటకు వెళ్లిన వారికి, పోలీసులకు మధ్య వాగ్వాదం తలెత్తింది. ఈ ఘటనలో విద్యార్థులపై పోలీసులు దాడి చేశారు. దీంతో విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో ఇకపై రాత్రిపూట విద్యార్థులెవరూ బయటకు వెళ్లకూడదని అధికారులు రూల్ తెచ్చారు.

Maharashtra: బాలికపై పన్నెండు గంటలపాటు సామూహిక అత్యాచారం.. 8 మంది నిందితులు అరెస్ట్

ఈ నిర్ణయాన్ని విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. గతంలో కూడా యూనివర్సిటీ అధికారులు ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. క్యాంటీన్‌లో, హాస్టల్‌లో ఎలాంటి వేడుకలు జరుపుకోకూడదని ఆదేశించారు. అంతకుముందు క్యాంటీన్‌లో ఒక బర్త్ డే పార్టీ సందర్భంగా రెండు విద్యార్థి గ్రూపుల మధ్య గొడవ తలెత్తింది. దీంతో క్యాంటీన్‌లో ఎలాంటి వేడుకలు జరుపుకోకూడదని అధికారులు నిబంధన విధించారు.