ఎంత పెద్ద మనసో : పేదలకు చెప్పులు పంచిన పోలీస్

  • Published By: veegamteam ,Published On : September 8, 2019 / 07:03 AM IST
ఎంత పెద్ద మనసో : పేదలకు చెప్పులు పంచిన పోలీస్

ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని మదర్ థెరిస్సా సాటి చెప్పారు. మానవసేవే మాధవ సేవల అని ఎంతోమంది మహానుభావులు చెప్పారు. సేవే పరమార్థంగా జీవించారు. బాధల్లో ఉన్నవారికి సాయం చేయటం అంటే భారీగా విరాళాలు ఇవ్వటం కాదు. తనకున్నదాంట్లో పేదలకు సాయం చేయటం అని సాటి చెబుతున్నాడు ఓ పోలీస్. తనకొచ్చే కొద్దిపాటి జీతంతోనే పేదలకు సాయం చేస్తు శెభాష్ పోలీసన్నా అనిపించుకుంటున్నారు లూథియానాలో ట్రాఫిక్ ఏఎస్సైగా పనిచేస్తున్న అశోక్ కుమార్. 

లుధియానాలో ట్రాఫిక్ ఏఎస్సై అశోక్‌కుమార్ ఎంతోమంది పేదవాళ్లను చూస్తుంటారు. వారి  కష్టాలు చూసి చలించిపోయని ఆయన తనవంతుగా ఏదోకటి చేయాలనుకున్నారు. మంచి పని చేయటానికి ఆలోచించాల్సిన పనిలేదు..అనుకున్నప్పుడే చేసేయాలని అని పెద్దల సూక్తిని పాటించారు అశోక్ కుమార్. తన జీతంలోని కొంతభాగాన్ని పేదల కోసం ఖర్చు పెడుతున్నారు. బట్టలు..దుప్పట్లు ఇలా వారి వారి అవసరాలను బట్టి సాయం చేయటం అలవాటుగా చేసుకున్నారు అశోక్ కుమార్. 

ఇలా రోడ్డు పక్కన నివసించే చెత్త సేకరించే చిన్నారులు  ఎర్రటి ఎండలో కాళ్లకు చెప్పులు కూడా లేకుండా నడవటం చూశారు.  అది చూసి ఎంతో బాధపడ్డారు. దీంతో వారికి చెప్పులు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా వెయ్యి జతల  చెప్పులు కొన్ని పంపిణీ చేశారు.  చెత్త సేకరించే చిన్నారులతో పాటు పలువురు పేదలకు పంపిణీ చేశారు.