లడ్డూ కావాలా నాయనా : రూ.30 వేలు మాత్రమే

  • Published By: veegamteam ,Published On : April 21, 2019 / 07:09 AM IST
లడ్డూ కావాలా నాయనా : రూ.30 వేలు మాత్రమే

లడ్డూ  కావాలా నాయనా..అది కూడా బంగారంతో చేసిన లడ్డూ. ఇది  కావాలంటే మాత్రం ఢిల్లీ వెళ్లాల్సిందే. అక్కడ ఫేమస్ గా మారిన ఈ స్పెషల్ లడ్డు తినాలంటే పైసలు మస్తుగా పెట్టాల్సిందే మరి. అది కూడా వందల్లో కాదండోయ్..వేలల్లో. ఏంటి తినకుండానే చుక్కలు కనిపిస్తున్నాయా. టేస్ట్ చూడకుండానే చక్కెర వచ్చేస్తోంది కదూ. వారి ఆ స్పెషల్ లగ్జీరీ స్వీట్స్ గురించి తెలుసుకుందాం..

ఒక్కో స్వీట్ కు ఒక్కో ప్రాంతం ఫేమస్. స్వీట్లు సాధారణంగా కిలో వందల ఖరీదులో ఉంటాయి. ఆవు నేతితో చేసిన స్వీట్స్ కు ఇంకొంచెం రేటు ఎక్కువ ఉంటాయి. కానీ ఒక్క స్వీట్ పీస్ కొనాలంటే వేలలో ఉంటుందంటే నమ్ముతారా? ఇవి ఓ కిలో కొనాలంటే రూ.30 వేలు చెల్లించాల్సిందే. రేటు తో పాటు టేస్ట్ కూడా అద్దిరిపోద్ది. అంత ఖరీదు ఎందుకు? అనే డౌట్ కూడా వచ్చే ఉంటుంది. ఈ లగ్జరీ స్వీట్స్ వ్యాపారం రేంజ్ ఎలా ఉందంటే..దేశంలో ఏటా రూ. 8 వేల కోట్ల వ్యాపారం జరుగుతోంది. 

మార్కెట్‌లో గోల్డ్  బిస్కెట్ తరహాలో కనిపించే ఈ స్వీట్స్  ఒక పీస్ ధర వేల రూపాయల్లో ఉంటుంది. ఈ స్వీట్స్ పై 24 క్యారెట్ల బంగారపు కాగితాన్ని అద్దుతారు. ఢిల్లీలోని ‘గుర్-చీనీ’ అనే మిఠాయి దుకాణంలో లగ్జరీ స్వీట్స్ లను  తయారు చేస్తుంటారు. ఇటీవల ముఖేష్ అంబానీ ఇంట జరిగిన పెళ్లి వేడుకలకు ఇక్కడి నుంచే స్వీట్లను ఆర్డర్ చేసి పెళ్లి విందులో వడ్డించారట.
అలాగే ఇక్కడ తయారు చేసే ‘స్వర్ణమిష్ఠి’ అనే స్వీట్  ఖరీదు కిలో రూ. 21 వేలు. ఈ స్వీట్‌పై ఇటాలియన్ పిస్తా, బంగారంతో డెకరేట్ చేస్తారట. అందుకే అది అంత ఖరీదు.