Made-In-India Aircraft Carrier : వచ్చే ఏడాదే INS విక్రాంత్ ప్రారంభం

భారతదేశపు మొట్టమొదటి..స్వదేశీ తయారీ యుద్ధ విమాన వాహక నౌక INS విక్రాంత్ ను వచ్చే ఏడాదే ప్రారంభిస్తామని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు.

Made-In-India Aircraft Carrier : వచ్చే ఏడాదే INS విక్రాంత్ ప్రారంభం

Ins Vikrant

Made-In-India Aircraft Carrier భారతదేశపు మొట్టమొదటి..స్వదేశీ తయారీ యుద్ధ విమాన వాహక నౌక INS విక్రాంత్ ను వచ్చే ఏడాదే ప్రారంభిస్తామని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. INS విక్రాంత్ పోరాట సామర్ధ్యం,ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే సామర్థ్యం..దేశ రక్షణలో బలీయమైన సామర్థ్యాలను జోడిస్తాయని రాజ్ నాథ్ తెలిపారు. నౌక నిర్మాణ పురోగతిపై కేరళ రాష్ట్రంలోని కొచ్చిలోని నేవల్ కమాండ్ లో శుక్రవారం రాజ్ నాథ్ సమీక్ష చేశారు.

కొచ్చిన్ పోర్ట్ లో INS విక్రాంత్ ను సందర్శించిన రాజ్ నాథ్..ఆత్మనిర్భర్ భారత్ కు ఐఎన్ఎస్ విక్రాంత్ ఒక మచ్చుతునక అన్నారు. అది దేశానికే గర్వ కారణమని కొనియాడారు. INS విక్రాంత్ లో 75 శాతం వరకు స్వదేశీ సామగ్రినే వాడుతున్నామని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. చెప్పారు. ఉక్కు నుంచి నిర్మాణం వరకు, సెన్సర్ల నుంచి ఆయుధాల వరకు దేశీయంగా తయారు చేసినవేనని తెలిపారు. 75వ స్వాతంత్ర్యదినోత్సవ కానుకగా దేశానికి ఈ నౌకను వచ్చే ఏడాది ప్రారంభిస్తామన్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్ తో తీర ప్రాంతంలో దేశ ప్రయోజనాలను కాపాడుకుంటామన్నారు. నౌకాదళాన్ని మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామన్నా రాజ్ నాథ్.. ఐఎన్ఎస్ విక్రాంత్ తో పాటు ‘ప్రాజెక్ట్ సీ బర్డ్’ పేరిట కార్వార్ లో నిర్మిస్తున్న అతిపెద్ద నౌకదాళ బేస్ ప్రాజెక్టులే రక్షణ రంగంలో తమ నిబద్ధతకు నిదర్శనమన్నారు. ఆధునికీకరణపై తాము చూపిస్తున్న శ్రద్ధ వల్లే దేశీయ పరిశ్రమలకు ప్రాధాన్యం దక్కుతోందని చెప్పారు. 44 యుద్ధ నౌకల్లో 42 నౌకలను భారత షిప్ యార్డుల్లో తయారు చేయడమే అందుకు నిదర్శనమన్నారు.

ప్రాజెక్ట్ 75-I RFC (ప్రతిపాదనలు)కి ఇటీవలే రక్షణ కొనుగోళ్ల మండలి(DAC) ఆమోదం తెలిపిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వ్యూహాత్మక భాగస్వామ్య నమూనా కింద దీనిని అభివృద్ధి చేస్తామన్నారు. ఎలాంటి సవాళ్లు ఎదురైనా ఎదుర్కొనేందుకు భారత నౌకాదళం సిద్ధంగా ఉందన్నారు. గాల్వాన్ ఘర్షణల నేపథ్యంలో నౌకాదళం ఎంత వేగంగా స్పందించిందో గుర్తు చేశారు. కరోనా మహమ్మారితో పోరులోనూ నేవీ కృషి ఎనలేనిదన్నారు. ఆపరేషన్ సముద్ర సేతు-1 ద్వారా విదేశాల్లోని భారతీయులను స్వేదానికి,ఆపరేషన్ సముద్ర సేతు-2 ద్వారా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను విదేశాల నుంచి దేశానికి చేర్చినట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ SAGAR (సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన ద రీజియన్– ఇండో పసిఫిక్ ప్రాంతంలో సమగ్రాభివృద్ధి, భద్రత)విజన్ లో భాగంగా ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజ్ నాథ్ తెలిపారు.