Made-In-India Helicopters: వాయుసేనలో అధికారికంగా చేరిన మొదటి స్వదేశీ తేలికపాటి యుద్ధ హెలికాప్టర్

భారత వాయుసేనలో మొదటి స్వదేశీ తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ (ఎల్‌సీహెచ్‌) అధికారికంగా చేరింది. జోధ్ పూర్ వైమానిక స్థావరంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, వాయుసేన చీఫ్ వీఆర్ చౌదరి సమక్షంలో వాయుసేనలో చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో, దేశీయ పరిస్థితులకు అనుగుణంగా దీన్ని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. సియాచిన్-సాల్టోరో ప్రాంతం, తూర్పు లడఖ్‌లో వినియోగించేలా దీన్ని రూపొందించింది. 20ఎమ్ఎమ్ టరెట్ గన్లు, 70ఎమ్ఎమ్ రాకెట్ వ్యవస్థ, గగనతల లక్ష్యాలను గగనతలం నుంచి దీనితో ఛేదించవచ్చు.

Made-In-India Helicopters: వాయుసేనలో అధికారికంగా చేరిన మొదటి స్వదేశీ తేలికపాటి యుద్ధ హెలికాప్టర్

Made-In-India Helicopters: భారత వాయుసేనలో మొదటి స్వదేశీ తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ (ఎల్‌సీహెచ్‌) అధికారికంగా చేరింది. జోధ్ పూర్ వైమానిక స్థావరంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, వాయుసేన చీఫ్ వీఆర్ చౌదరి సమక్షంలో వాయుసేనలో చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో, దేశీయ పరిస్థితులకు అనుగుణంగా దీన్ని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. సియాచిన్-సాల్టోరో ప్రాంతం, తూర్పు లడఖ్‌లో వినియోగించేలా దీన్ని రూపొందించింది.

20ఎమ్ఎమ్ టరెట్ గన్లు, 70ఎమ్ఎమ్ రాకెట్ వ్యవస్థ, గగనతల లక్ష్యాలను గగనతలం నుంచి దీనితో ఛేదించవచ్చు. 5.8-టన్నుల ఈ తేలికపాటి హెలికాప్టర్లను దశల వారీగా అన్ని ప్రదేశాల్లోను వైమానిక దళం మోహరించనుంది. తొలిదశలో లఢక్, జమ్మూకశ్మీర్ లోని అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో సైనిక అవసరాల కోసం మోహరించనుంది. ఈ హెలికాప్టర్లతో శత్రు దేశ మానవ రహిత విమానాలు, సైనిక కార్యకలాపాలు, ట్యాంకుల మోహరింపు, బ్యాంకర్లపై నిఘా పెరుగుతుందని వైమానిక వర్గాలు తెలిపాయి.

లఢక్ లో ఇప్పటికే రెండు ఎల్‌సీహెచ్‌లను చైనా సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నట్లు వైమానిక దళం తెలిపింది. 1999లో పాకిస్థాన్‌తో కార్గిల్‌ యుద్ధం సమయంలో ఓ విషయాన్ని గుర్తించామని, స్వదేశీ పరిజ్ఞానంతో, అత్యంత ఎత్తులో పూర్తి సామర్థ్యంతో పనిచేయగలిగే సాయుధ హెలికాప్టర్‌ అవసరమని భావించినట్లు చెప్పారు వైమానిక దళ అధికారులు.

అత్యంత ఎత్తైన, విభిన్న వాతావరణ పరిస్థితుల్లో సమర్థంగా పనిచేసే హెలికాప్టర్ల కోసం చాలా కాలంగా రక్షణ దళాలు ఎదురుచూస్తున్నాయి. సుమారు 160 తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు అవసరం అని భావించినట్లు వైమానిక వర్గాలు తెలిపాయి. మొదట 10 హెలికాప్టర్లు వైమానిక దళానికి, మరో ఐదు ఆర్మీకి హల్ సరఫరా చేస్తుంది.

ఇప్పటికే ఎనిమిది హెలికాప్టర్లను వైమానిక దళానికి అందించింది. 16,400 అడుగుల ఎత్తులో లాండింగ్, టేక్ ఆఫ్ తీసుకుంటూ పూర్తి స్థాయి ఆయుధ సామర్థ్యంతో ఇవి పనిచేస్తాయి. అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో, అత్యంత తక్కువ బరువుతో పని చేయగలవి వీటికి గుర్తింపు దక్కింది. బుల్లెట్ ప్రూఫ్, నైట్ విజన్, కూలిపోయినా ప్రాణ నష్టం తక్కువగా ఉండే విధంగా వీటిని అభివృద్ధి చేసింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..