74th Republic celebrations : గణతంత్ర వేడుకల్లో భారత్ సత్తాను చాటిచెప్పిన ‘బ్రహ్మోస్, అగ్ని, ఆకాశ్, నాగ్’ మిస్సైల్స్..శత్రు దేశాల వెన్నులో వణుకే..

భారత 74వ గణతంత్ర వేడుకల్లో భారత్ సత్తాను చాటిచెప్పాయి ‘బ్రహ్మోస్, అగ్ని, ఆకాశ్, నాగ్’ మిస్సైల్స్..ఇక భారత్ వైపు కన్నెత్తి చూడాలంటే శత్రు దేశాల వెన్నులో వణుకే.. అని హెచ్చరించాయి.

74th Republic celebrations : గణతంత్ర వేడుకల్లో భారత్ సత్తాను చాటిచెప్పిన ‘బ్రహ్మోస్, అగ్ని, ఆకాశ్, నాగ్’ మిస్సైల్స్..శత్రు దేశాల వెన్నులో వణుకే..

Made in India Weapons Systems Flaunted At 74th Republic Day Parade

74th Republic celebrations : భారత 74వ రిపబ్లిక్ పరేడ్ అంతా.. సాయుధ దళాల మెరుపులే కనిపించాయ్. అర్జున్ ట్యాంకులు, కె-9 వజ్ర ట్యాంకులు, క్విక్ రియాక్షన్ ఫైట్ వెహికిల్స్ మాత్రమే కాదు.. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే మరికొన్ని స్వదేశీ ఆయుధ వ్యవస్థలను కూడా ప్రదర్శించారు. వాటన్నింటిని అధునాతన టెక్నాలజీతో తయారుచేశారు. యుద్ధ రంగంలోకి దిగితే వాటి సత్తా ఏంటో అర్థమవుతుంది.

ఆత్మనిర్భర్ భారత్ సత్తాను సగర్వంగా ఈ ప్రపంచానికి చాటేందుకు.. రిపబ్లిక్ డే పరేడ్
ఇండియన్ ఆర్మీలో ఆయుధాలంటే.. ఎక్కడెక్కడి దేశాల నుంచో కొన్నవి మాత్రమే కనిపించేవి. కానీ.. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయ్. ఓ వైపు విదేశాల నుంచి మిత్ర దేశాల నుంచి కొంటూనే.. సొంతంగా ఆయుధాలు తయారుచేసుకునే స్థాయికి ఎదిగాం. భారత రక్షణశాఖ చేసుకుంటున్న ఒప్పందాలు కూడా అలాగే ఉంటున్నాయ్. ఆయుధాల అమ్మకంతో పాటు టెక్నాలజీని కూడా ట్రాన్స్‌ఫర్ చేసేలా ఎంవోయూలు కుదుర్చుకుంటోంది. తద్వారా.. దేశీయంగా ఆయుధాల తయారీ పెరిగింది. ఇప్పుడు వాటినే.. భారతీయత ఉట్టిపడేలా, ఆత్మనిర్భర్ భారత్ సత్తాను సగర్వంగా ఈ ప్రపంచానికి చాటేందుకు.. రిపబ్లిక్ డే పరేడ్ వేదికైంది. చైనాతో ఉద్రిక్తతల వేళ.. మన సాయుధ సత్తాను చాటేందుకు.. మేడిన్ ఇండియా ఆయుధాలను ప్రదర్శించారు. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంలో భాగంగా.. దేశీయంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్, అగ్ని, ఆకాశ్, నాగ్ మిస్సైళ్లు ఆకర్షణీయంగా నిలిచాయ్.

India-China: భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం: అమెరికా

ధ్వని కంటే మూడు రెట్లు వేగంతో ప్రయాణించే బ్రహ్మోస్ క్షిపణి
రిపబ్లిక్ పరేడ్‌లో.. బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థను ప్రదర్శించారు. ప్రపంచంలోనే మొట్టమొదటి సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ ఇది. డీఆర్డీవో సామర్థ్యాన్ని.. ప్రపంచానికి చాటి చెప్పిన బ్రహ్మోస్‌ను.. యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్లు, భూ ఉపరితలం.. ఇలా ఎక్కడి నుంచైనా దీనిని ప్రయోగించొచ్చు. ధ్వని కంటే మూడు రెట్లు వేగంతో.. ఇది ప్రయాణిస్తుంది. వంద శాతం కచ్చితత్వంతో టార్గెట్లను ఛేదిస్తుంది. ప్రపంచంలోనే.. అత్యంత శక్తిమంతమైన మిస్సైల్‌గా బ్రహ్మోస్ గుర్తింపు పొందింది. అంతేకాదు.. శత్రు దేశాల రాడార్‌ల నుంచి కూడా చాలా సులభంగా తప్పించుకోగలదు. ఇంత పక్కాగా తయారుచేశారు కాబట్టే.. బ్రహ్మోస్ పేరు వింటే శత్రు దేశాల వెన్నులో వణుకు పుడుతోంది. విదేశాలు కూడా ఈ మిసైల్‌ను మన దగ్గరనుంచి కొనుగోలు చేస్తున్నాయంటే.. దీని శక్తి సామర్థ్యాలు ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

25 కిలోమీటర్ల దూరంలో టార్గెట్ ఛేధించే భారత్ తొలి మిస్సైల్ ‘ఆకాశ్2..
ఇక.. ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిన భారత్ తొలి మిస్సైల్ ఆకాశ్. భూతలం నుంచి గగనతలానికి ప్రయోగించే.. ఈ మిస్సైల్ 25 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదిస్తుంది. 95 శాతం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దీనిని తయారుచేశారు. ఇందుకు.. 25 ఏళ్లు పట్టింది. ఇప్పటికే.. వీటిని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కి, ఇండియన్ ఆర్మీకి అందజేశారు. విదేశాలకు విక్రయించడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయ్. ఈ ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని.. అమృత్‌సర్ ఎయిర్‌ఫీల్డ్‌కు చెందిన బృందం ప్రదర్శించింది.

India Military : అమెరికా, చైనా తర్వాత..రక్షణరంగంపై అధికంగా ఖర్చు పెడుతున్న దేశాల్లో మూడో స్థానంలో భారత్..

నిమిషానికి 4 మిస్సైళ్లను పేల్చే మరో అద్భుత అస్త్రం.. ‘నాగ్ యాంటీ ట్యాంక్ మిస్సైల్’
ఇక.. భారత రక్షణ శాఖ అమ్ముల పొదిలోని మరో అద్భుత అస్త్రం.. నాగ్ యాంటీ ట్యాంక్ మిస్సైల్. డీఆర్‌డీఓ దీనిని తయారుచేసింది. ఇది.. 20 కిలోమీటర్ల లోపు ఉన్న శత్రువుల యుద్ధ ట్యాంకులను కచ్చితత్వంతో పేల్చేస్తుంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో.. ఇది పనిచేస్తుంది. భూమితో పాటు గగనతలం నుంచి కూడా దీనిని ప్రయోగించవచ్చు. ఇక.. నాగ్ ఇందులో.. నాలుగు వేరియంట్లు ఉన్నాయి. బీఎంపీ-2 వాహనంపై అమర్చితే.. ఆరు మిస్సైళ్లను మోసుకెళ్లగలదు. ఒక్కో లాంచర్.. నిమిషానికి 4 మిస్సైళ్లను పేల్చగలదు.

Made In India F-INSAS..Nipun : ఇండియన్ ఆర్మీకి రక్షణ శాఖ అందించిన అత్యాధునిక ఆయుధాల ప్రత్యేకత..ఉపయోగాలు..

వీటితో పాటు బీఎంపీ-2 వాహనాలు, 10 మీటర్ల షార్ట్‌ స్పాన్‌ బ్రిడ్జ్‌ వాహనాలు, మొబైల్‌ మైక్రోవేవ్‌ నోడ్‌ అండ్‌ మొబైల్‌ నెట్‌వర్క్‌ సెంటర్‌‌ని కూడా ప్రదర్శించారు. పరేడ్‌లో భాగంగా.. ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బృందాలు చేసిన కవాతు అందరినీ ఆకర్షించాయి. వాయుసేన, నేవీ, డీఆర్డీవో.. తమ శకటాలను కూడా ప్రదర్శించాయి.

Also read : Made In India F-INSAS..Nipun : చైనాకు చెక్ పెట్టటానికి లద్దాఖ్ సరిహద్దుల్లో భారత సైన్యానికి అత్యాధునిక ఆయుధాలు