India 74th Republic celebrations : 74వ గణతంత్ర వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా మేడిన్ ఇండియా ఆయుధాలు

ఇప్పటిదాకా మనం ఎన్నో రిపబ్లిక్ డే పరేడ్స్‌ చూశాం. కానీ.. ఈ రిపబ్లిక్ పరేడ్‌ చాలా చాలా స్పెషల్. 74వ గణతంత్ర వేడుకల్లో.. సైనిక విన్యాసాలతో పాటు ఆయుధ ప్రదర్శన అందరి దృష్టిని ఆకర్షించింది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా.. దేశీయంగా తయారైన ఆయుధాలు భారత ప్రజలందరినీ ఆకట్టుకున్నాయ్. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారుచేసిన.. యుద్ధ ట్యాంకులు, మిస్సైళ్లు, సరికొత్త ఆయుధ వ్యవస్థలు.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయ్.

India 74th Republic celebrations : 74వ గణతంత్ర వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా   మేడిన్ ఇండియా ఆయుధాలు

India 74th Republic celebrations :  ఇప్పటిదాకా మనం ఎన్నో రిపబ్లిక్ డే పరేడ్స్‌ చూశాం. కానీ.. ఈ రిపబ్లిక్ పరేడ్‌ చాలా చాలా స్పెషల్. 74వ గణతంత్ర వేడుకల్లో.. సైనిక విన్యాసాలతో పాటు ఆయుధ ప్రదర్శన అందరి దృష్టిని ఆకర్షించింది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా.. దేశీయంగా తయారైన ఆయుధాలు భారత ప్రజలందరినీ ఆకట్టుకున్నాయ్. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారుచేసిన.. యుద్ధ ట్యాంకులు, మిస్సైళ్లు, సరికొత్త ఆయుధ వ్యవస్థలు.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయ్. ఓ వైపు చైనా, మరోవైపు పాకిస్థాన్‌తో సరిహద్దుల వివాదాలు కొనసాగుతున్న వేళ.. ఈ ఆయుధాలు శత్రు దేశాలతో పాటు మిగతా ప్రపంచానికి కూడా భారతదేశ సత్తాను చాటాయ్.

రిపబ్లిక్ డే పరేడ్ అంటే.. దేశంలో పెరుగుతున్న స్వదేశీ సామర్థ్యాలను, మహిళా శక్తిని, సాంస్కృతికి వైవిధ్యాన్ని తెలియజేస్తుంది. దాంతో పాటు న్యూ ఇండియా ఆవిర్భావాన్ని తెలియజేసేలా.. భారత సైనిక పరాక్రమం, ఇండియన్ మిలటరీ సత్తా ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పేలా ఉంటుంది. ఈసారి కూడా అదే కనిపించింది. కర్తవ్యపథ్‌లో తొలిసారి నిర్వహించిన ఆర్మీ పరేడ్‌లో.. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా తయారుచేసిన స్వదేశీ ఆయుధాలను ప్రదర్శించారు. మన త్రివిధ దళాలు ప్రపంచ దేశాలకు తమ సత్తా ఏమిటో చాటి చెప్పాయి.

ఈ రిపబ్లిడ్ డే కవాతులో.. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారుచేసిన యుద్ధ ట్యాంకులు, ఆయుధ వ్యవస్థలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయ్. పరేడ్‌లో ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ శకటాలు అందరినీ ఆకట్టుకున్నాయ్. 861 బ్రహ్మోస్ రెజిమెంట్‌ డిటాచ్‌మెంట్ కూడా ఈ పరేడ్‌లో పాల్గొంది. ఒంటెలతో కూడిన బీఎస్‌ఎఫ్‌ బృందం కవాతు ఆకట్టుకుంది. 8711 ఫీల్డ్‌ బ్యాటరీ బృందం, 21 గన్‌ సెల్యూట్‌ కోసం దేశీయంగా తయారు చేసిన 105 ఎంఎం ఇండియన్‌ ఫీల్డ్‌ గన్స్‌ వాడారు. ముఖ్యంగా.. అర్జున్ ఎంకె-1 యుద్ధ ట్యాంకు, ఫాస్ట్ రియాక్షన్ ఫైటింగ్ వెహికిల్స్, కె-9 వజ్ర.. సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిలరీ, ఆకాశ్, నాగ్ మిస్సైల్ సిస్టమ్స్‌తో పాటు మరికొన్ని సైనిక ఆయుధాలను ప్రదర్శించారు. ఇవన్నీ.. భారత్‌లో తయారవ్వడం.. అందరికీ గర్వకారణం.

ఆత్మనిర్బర్ భారత్‌ కింద భారత దళాలకు అందిన అతిపెద్ద అధునాతన ఆయుధం అర్జున్ ఎంకే-1 యుద్ధ ట్యాంక్. ఇప్పటికే.. సైన్యంలో అర్జున్-ఎంబీటీ వార్ ట్యాంకులు ఉన్నాయ్. అయితే.. దాదాపు 71 మార్పులతో.. అర్జున్-ఎంకే1 రూపంలో అప్‌డేటెడ్ వెర్షన్‌ని తీసుకొచ్చారు. దీని ఫైర్‌ పవర్ కెపాసిటీని డీఆర్డీవో బాగా పెంచింది. భవిష్యత్ యుద్ధ తంత్రానికి చెందిన వ్యవస్థలు.. దీనిలో ఉన్నాయ్. వీటిని హంటర్ కిల్లర్స్ అని కూడా పిలుస్తారు. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ.. ఇది స్థిరంగా పనిచేయగలదు. అర్జున్ ట్యాంక్‌లో కొత్త టెక్నాలజీ ట్రాన్స్‌మిషన్ వ్యవస్థ కూడా ఉంది. దీంతో.. టార్గెట్లను చాలా ఈజీగా కనిపెట్టేందుకు వీలవుతుంది. వార్ గ్రౌండ్‌లోకి దిగితే.. చాలా సులభంగా ముందుకు కదులుతుంది. కెమికల్ దాడులను నివారించేందుకు.. ఇందులో ప్రత్యేక సెన్సార్లను అమర్చారు. ఈ ట్యాంక్ వచ్చిన తర్వాత.. భూమిపై జరిగే యుద్ధాల స్వభావమే మారిపోయింది. ఈ వార్ ట్యాంక్ ఫిన్-స్టెబిలైజ్డ్ డిశ్చార్జింగ్ సాబోట్ సిస్టమ్.. యుద్ధ రంగంలో.. శత్రువుల ట్యాంక్‌లను గుర్తించి మరీ నాశనం చేస్తుంది. అర్జున్ వార్ ట్యాంక్ 68 టన్నులు బరువు ఉంటుంది. 120ఎంఎం బుల్లెట్ రౌండ్స్ వినియోగించే గన్‌ను దీనికి అమర్చారు. ఈ ట్యాంక్ సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్ కూడా బలంగా ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇక.. అత్యవసర పరిస్థితుల్లో సైన్యం వేగంగా స్పందించేందుకు వీలుగా.. క్విక్ రియాక్షన్ ఫైటింగ్ వెహికిల్స్‌ని ఆర్మీకి అందించింది ప్రభుత్వం. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ వీటిని తయారుచేసింది. రాబోయే కాలంలో.. భారత సైన్యం సామర్థ్యాలను ఇవి మరింత మెరుపరచనున్నాయ్. ఇందులో.. కమాండర్, డ్రైవర్‌తో సహా 14 మంది వెళ్లేందుకు వీలుంది. 2 టన్నుల దాకా పేలోడ్‌ని మోయగలదు. వీటి మెయింటెనెన్స్, ఆపరేటింగ్ కాస్ట్ కూడా చాలా తక్కువ. ఈ క్విక్ రియాక్షన్ ఫైటింగ్ వెహికిల్స్.. 14 నుంచి 21 కిలోల పేలుడు పదార్థాల దాకా లెవెల్ 4 ప్రొటెక్షన్‌ని అందిస్తుంది.

ఆర్మీ అమ్ముల పొదిలో మరో అద్భుత అస్త్రం.. కే-9 వజ్ర.. 2018లో తొలిసారి ఆర్మీకి అందించారు. ఇది.. సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిలరీ సిస్టమ్. మైదాన ప్రాంతాల్లో అత్యంత సమర్థంగా పనిచేస్తుంది. ప్రస్తుతం లద్దాఖ్ సరిహద్దుల్లో వీటిని మోహరించా. 155 ఎంఎం కెనాన్ కలిగిన ఈ శతఘ్ని.. 18 నుంచి 52 కిలోమీటర్ల దూరం దాకా బాంబుల వర్షం కురిపించగలదు. ఇది గంటకు 67 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది.