Pappad Baba : సజీవ సమాధి అయ్యేందుకు ప్రయత్నించిన పప్పడ్ బాబా..అడ్డుకున్న పోలీసులు

మధ్యప్రదేశ్ లోని సజీవ సమాధి అయ్యేందుకు ప్రయత్నించిన ఓ బాబాను పోలీసులు అడ్డుకున్నారు.

Pappad Baba : సజీవ సమాధి అయ్యేందుకు ప్రయత్నించిన పప్పడ్ బాబా..అడ్డుకున్న పోలీసులు

Mp (1)

మధ్యప్రదేశ్ లోని సజీవ సమాధి అయ్యేందుకు ప్రయత్నించిన ఓ బాబాను పోలీసులు అడ్డుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నాం మోరెనా జిల్లా తుస్సిపురా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అసలేం జరిగింది

తుస్సిపురా గ్రామానికి చెందిన 105 ఏళ్ల రాంసింగ్ అలియాస్ పప్పడ్ బాబా ఇవాళ సజీవ సమాధి అవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ రోజు మధ్యాహ్నాం హనుమాన్‌ ఆలయంలో తాను సజీవ సమాధి అవ్వాలనుకుంటున్నాను అని ఇవాళ ఉదయం 5గంటల సమయంలో తన మనువడు ప్రేమ్ సింగ్ కుష్వాహాకి తెలిపాడు. చుట్టుపక్కల గ్రామాల్లోని వారికి కూడా ఈ సమాచారం తెలియజేయాలని తన మనువడికి చెప్పాడు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామస్థులు తుస్సిపుర గ్రామానికి చేరుకున్నారు.

ఇవాళ మధ్యాహ్నాం 12 గంటలకు స్నానం చేసిన బాబా కొద్దిసేపు దేవుడిని ప్రార్థించారు. అనతంరం 2 14 గంటల సమయంలో సమాధి అయ్యేందుకు అప్పటికే తన అనుచరులు సిద్ధం చేసి ఉంచిన నాలుగు అడుగుల లోతైన సమాధిలో పడుకున్నారు. మహిళలు డోలక్ ప్లే చేస్తూ భజన్-కీర్తన్ ప్రారంభించారు. మధ్యాహ్నాం 3:30గంటల సమయంలో బాబా..తనపై మట్టి చల్లి సమాధిని పూడ్చాలని ఆదేశించారు. అయితే గ్రామస్తులు దానికి నిరాకరించారు. ఇదే సమయంలో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బాబాను అడ్డుకున్నారు. సమాధి నుంచి ఆయన్ని బయటకు తీసి హాస్పిటల్ కు తరలించారు.