164 Rare Coins : మధ్యప్రదేశ్ లోని ఇసుక క్వారీలో బయటపడ్డ 164 పురాతన నాణేలు
మధ్యప్రదేశ్ లో ఇసుక క్వారీలో 164 పురాతన నాణేలు బయటపడ్డాయి. ఓ కుండలో బయటపడ్డ ఈ నాణాల్లో వెండి రాగి నాణాలు ఉన్నాయి.

164 rare coins found in Bundelkhand : మధ్యప్రదేశ్ తికమ్‌గర్హ్ జిల్లాలో పురాతన కాలంనాటి నాణాలు బయటపడ్డాయి. ఓ ఇసుక క్వారీ తవ్వుతుండగా 164 పురాతన నాణేలు బయటపడ్డాయి. ఈ నాణాలను పరిశీలించిన పరిశోధకలు ఇవి మొఘలుల కాలం నాటివిగా భావిస్తున్నామని జిల్లా మైనింగ్ అధికారి ప్రశాంత్ తివారీ తెలిపారు. ఇసుక క్వారీలో పనులు చేస్తుండగా ఓ కుండ బయటపడింది. దీంట్లో పురాతన నాణేలు లభించినట్లు అధికారులు తెలిపారు.
బుందేల్‌ఖాండ్ బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని జిల్లా కేంద్రానికి 55 కిలోమీటర్ల దూరంలోని నందనవర గ్రామంలో ఓ ప్రవేయిటు కాంట్రాక్టర్‌కు చెందిన మైనింగ్‌లో ఇసుక క్వారీని తవ్వుతుండగా ఈ పురాతన నాణేలు లభ్యమైయ్యాయి. ఆ నాణేలు బయటపడ్డ ప్రదేశాన్ని మైనింగ్ అధికారి ప్రశాంత్ తివారీ పరిశీలించారు. బయటపడ్డ ఈ 164 నాణేల్లో 12 వెండి నాణేలు ఉన్నాయని..మిగతావి కాపర్ నాణేలు అని తెలిపారు. ఈ నాణేలన్నింటిని జిల్లా ట్రెజరీ కార్యాలయానికి తరలించారు. కాగా బుందేల్‌ఖాండ్ రీజియన్‌లో ఒకప్పుడు ఆఫ్ఘన్స్, మొఘల్స్ తమ సామ్రాజ్యాన్ని నెలకొల్పారు.
Read more : Ancient Wine Factory:తవ్వకాల్లో బయటపడ్డ 1500 ఏళ్ల నాటి మద్యం ఫ్యాక్టరీ..పరిశోధనలో విస్తుగొలిపే విషయాలు..
ఈ నాణాలపై ఉన్న భాషల్ని ఉర్ధూ గానీ..పర్షియన్ భాషలుగా భావిస్తున్నారు. ఈ భాషను బట్టి ఈ నాణేలు ఏ కాలానికి చెందినవో పరిశోధకులు తెలుసుకోనున్నారు. నివారి జిల్లాలోని నందనవారా గ్రామానికి 45 కి.మీ దూరంలో ఉన్న ఓర్చా, రామ్ రాజా ఆలయానికి ప్రసిద్ధి చెందింది. ఇది నివారి జిల్లా 2018లో తికమ్‌ఘర్ నుండి విడిపోయింది.
బుందేల్‌ఖండ్‌లోని ఈ ప్రాంతం ఆఫ్ఘన్లు,మొఘల్‌ల పాలించారు. వారి ఆనవాళ్లు పలు సందర్భాల్లో ఈ ప్రాంతాల్లో బయటపడ్డాయి. చరిత్ర ప్రకారం.. జుజార్ సింగ్ 1626లో ఓర్చా రాజు అయ్యాడు. మొఘల్ సామ్రాజ్యానికి సామంతుడిగా ఉండనని ప్రతిజ్ఞ చేశాడు ఓర్చా రాజు జుజార్ సింగ్. మొఘల్ చక్రవర్తి షాజహాన్ నుండి స్వాతంత్ర్యం పొందేందుకు అతని ప్రయత్నం అతని పతనానికి మార్గమైందని చరిత్ర చెబుతోంది.షాజహాన్ కుమారుడైన ఔరంగజేబు నేతృత్వంలోని మొఘల్ సైన్యం ఓర్చా రాజు జుజార్ సింగ్ పై దాడిచేసింది. అతని పరిధిలో ఉన్న భూమిపై దాడి చేసి 1635లో స్వాధీనం చేసుకుంది.
Read more : 4500 Year Old Sun Temple : ఫారోల దేశంలో బయటపడ్డ 4500 ఏళ్ల నాటి సూర్యదేవాలయం..
- WhatsApp Group : వాట్సప్ గ్రూప్‌లో అశ్లీల వీడియో షేర్ చేసిన ఎక్సైజ్ అధికారిపై వేటు
- Cheetah: భారత్ రానున్న చీతాలు.. 70 ఏళ్ల తర్వాత తొలిసారి
- Bear Kills Couple : గుడిలో ప్రార్థనలు చేస్తుండగా ఘోరం.. దంపతులను చంపి తిన్న ఎలుగుబంటి
- Uttarakhand: ఉత్తరాఖండ్‌లో బస్సు ప్రమాదం.. 22 మంది మృతి
- Supreme Court : ఆర్య సమాజ్ పెళ్లిళ్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..వారిచ్చే వివాహ ధ్రువపత్రం చెల్లదు
1BJP National Executive Meeting : బీజేపీ సమావేశాల్లోకి తెలంగాణా ఇంటిలెజెన్స్ పోలీసులు
2Potatoes : రక్తంలో కొలొస్ట్రాల్ స్ధాయిలను తగ్గించే బంగాళ దుంప!
3PM Modi Meeting: విజయ సంకల్ప సభ భారీ కవరేజ్‌కు కమలనాథుల ప్రణాళిక.. సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా ప్లాన్
4Alluri Statue: భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధం
5Monkeypox : రూపం మార్చుకున్న మంకీపాక్స్..బ్రిటన్‌లోని రోగుల్లో వేరే లక్షణాలు
6Rahul Narwekar: ‘మహా’ స్పీకర్‌గా రాహుల్ నార్వేకర్.. రేపు షిండే బల పరీక్ష
7KA Paul: ఎకనామిక్ సమ్మిట్ పెట్టండంటే మోదీ పెట్టడం లేదు.. 8లక్షల కోట్లు తెస్తా
8Vishwaksen : టైగర్స్‌తో మాస్ కా దాస్ విశ్వక్
9Gold Rate: ఆదివారం కూడా ఆకాశానికే.. దక్షిణాదిలో బంగారం ధరలిలా
10Krishna Dist: పాత పగలతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. కృష్ణా జిల్లాలో ఉద్రిక్తత
-
Kurnool : ఆస్తి కోసం పిన్నమ్మనే హత్య చేశారు
-
Traffic Diversions : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో బీజేపీ బహిరంగ సభ.. ట్రాఫిక్ మళ్లింపులు
-
Pakistan Protests : పాకిస్తాన్‌లోనూ ప్రవక్తపై వ్యాఖ్యల కల్లోలం
-
Foreign Donations : విదేశీ విరాళాల నియంత్రణ చట్టంలో మార్పులు
-
Murmu, Yashwant Sinha : రాష్ట్రపతి ఎన్నికల బరిలో యశ్వంత్ సిన్హా, ద్రౌపదీ ముర్ము ఫైనల్
-
Bangaru Bonam : విజయవాడ దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం
-
Umesh Murder : ఉమేశ్ హత్య కేసులో ఏడుగురు అరెస్ట్
-
Nupur Sharma : నుపుర్ శర్మపై లుక్ అవుట్ సర్క్యులర్