Madhya pradesh : భోపాల్‌లో రైల్వే కూలీల కోసం ఏసీ రెస్ట్ రూమ్స్

రైల్వే కూలీల కోసం.. మధ్యప్రదేశ్‌ అధికారులు ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. వారి సౌకర్యార్థం.. భోపాల్ రైల్వే స్టేషన్‌లో.. రెస్ట్‌ రూమ్స్‌ను నిర్మించబోతున్నారు. అది కూడా.. ఏసీ రెస్ట్ రూమ్స్. ఇందుకోసం.. అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎయిర్ కండీషన్‌తో పాటు సకల సౌకర్యాలతో రూమ్స్ కూడా సిద్ధం చేయనున్నారు.

Madhya pradesh  : భోపాల్‌లో రైల్వే కూలీల కోసం ఏసీ రెస్ట్ రూమ్స్

Ac Rest Rooms For Railway Workers In Bhopal

AC Rest Rooms for Railway Workers in Bhopal  : పబ్లిక్ ప్లేసులో.. పబ్లిక్ టాయిలెట్ అందుబాటులో ఉంటే.. అక్కడి పబ్లిక్‌కి చాలా రిలీఫ్‌గా.. ఉంటుంది. అదే పబ్లిక్ ప్లేసులో.. ఆ పబ్లిక్ కోసం పనిచేసే.. పోర్టర్లకు మాత్రం సరైన టాయిలెట్ ఉండదు. కానీ.. ఈ పరిస్థితి మారబోతోంది. వాళ్ల కోసం.. ఏకంగా ఏసీ రెస్ట్ రూమ్‌నే నిర్మించబోతున్నారు. ఐడియా అదిరిపోయింది కదూ..

రెగ్యులర్, రోటీన్ న్యూసే కాదు.. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చూడాలి. కచ్చితంగా తెలుసుకోవాలి. విషయమేమిటంటే.. రైల్వే కూలీల కోసం.. మధ్యప్రదేశ్‌ అధికారులు ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. వారి సౌకర్యార్థం.. భోపాల్ రైల్వే స్టేషన్‌లో.. రెస్ట్‌ రూమ్స్‌ను నిర్మించబోతున్నారు. అది కూడా.. ఏసీ రెస్ట్ రూమ్స్. ఇందుకోసం.. అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎయిర్ కండీషన్‌తో పాటు సకల సౌకర్యాలతో రూమ్స్ కూడా సిద్ధం చేయనున్నారు. ఇందుకోసం.. రైల్వే భూముల్లోని ఆక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రయాణికుల కోసం.. రెండు లైన్ల బ్రిడ్జ్‌ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

Also read : Cows toilet : టాయిలెట్‌ వాడుతున్న ఆవులు..మనుషుల కంటే జంతువులే నయమనిస్తున్నాయి.

నిజానికి.. రైల్వే కూలీలంటే చాలా మంది చిన్నచూపు చూస్తారు. కానీ.. వారు కష్టపడి సంపాదించుకొని జీవనం సాగిస్తారు. రైల్వే స్టేషన్‌లో మూట ఎత్తితేనే.. పూట గడిచే బతుకులు వాళ్లవి. అలాంటి వారి కష్టానికి ఫలితం దక్కేది తక్కువే. వారిని ప్రభుత్వమే గుర్తించారు. తగిన విధంగా గౌరవించాలి. దీనికి.. ఇప్పుడిప్పుడే బాటలు పడుతున్నాయ్. రైల్వే స్టేషన్‌లో ప్యాసింజర్లకే కాదు.. పోర్టర్లకు కూడా రెస్ట్ రూమ్స్‌ని నిర్మించేందుకు.. మధ్య ప్రదేశ్‌లో తొలి అడుగులు పడ్డాయ్.

భోపాల్ రైల్వే స్టేషన్‌లో.. ప్రత్యేకంగా కూలీల కోసం ఏసీ రెస్ట్ రూమ్స్ నిర్మించనున్నారు. అధికారులతో చర్చించి.. మంత్రి విశ్వాస్ సారంగ్ దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ప్లాట్ ఫామ్ నెంబర్ వన్‌ వైపు ఉన్న రైల్వే భూమిలో.. కూలీల కోసం అన్ని సౌకర్యాలతో కూడిన.. ఎయిర్ కండీషన్డ్ రెస్ట్ రూమ్స్ ఏర్పాటు చేయాలని.. మంత్రి సారంగ్ ఆదేశించారు. దీని కోసం.. సుభాష్ నగర్ ఆర్వోబీ సమీపంలోని మోతీనగర్ ప్రాంతం, భారత్ టాకీస్ ఆర్వోబీ సమీపంలోని గోదాం వైపు ఆక్రమణలు తొలగించాలని.. సారంగ్ అధికారులను ఆదేశించారు. అలాగే.. ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేసేందుకు.. చోళ మందిరం నుంచి ప్రధాన రైల్వే స్టేషన్‌లోని.. ప్లాట్ ఫామ్ నెంబర్ వన్ వరకు.. రెండు లైన్ల బ్రిడ్జ్‌ను నిర్మించనున్నారు.

Also read : Lion In Toilet : జెంట్స్ టాయిలెట్ లోంచి బయటకొస్తున్న ఆడ సింహం..ఇదేం సిగ్గురా బాబూ అంటున్న జనాలు..

ఏదేమైనా.. రైల్వే స్టేషన్‌లో రెస్ట్ రూమ్స్ నిర్మిస్తే.. కూలీలు కొంత సమయం విశ్రాంతి తీసుకునే అవకాశం దొరుకుతుంది. ఇది.. ఆహ్వానించదగ్గ పరిణామం అని.. ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.