Corona free area : గ్రామ మహిళల కృషి..కరోనా జాడనే దరి చేరనివ్వలేదు

Corona free area : గ్రామ మహిళల కృషి..కరోనా జాడనే దరి చేరనివ్వలేదు

No Corona Cases

Agar malwa corona free  : భారతదేశమంతా కరోనా మహమ్మారితో అల్లాడిపోతోంది. జనాల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. బాధితులకు ఆసుపత్రులలో బెడ్లు లేవు, ఆక్సిజన్ అంతకంటే లేదు. ఆక్సిజన్ బ్లాక్ మార్కెట్ దందా అంతా ఇంతా కాదు. మాస్కులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కరోనా భయమే లేని గ్రామం చాలా హాయిగా ‘కరోనా లేదు..గిరోనా లేదు..వస్తే తాట తీస్తాం’అంటున్నారు మధ్యప్రదేశ్‌లోని ఆగర్- మాల్వా గ్రామంలోని మహిళలు. మాల్వా గ్రామంలో మహిళలు తీసుకునే జాగ్రత్తలతో ఆ గ్రామంలో కరోనా జాడే లేదు. ఈనాటి వరకూ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదంటే..వాళ్లు ఎంత అప్రమత్తంగా ఉన్నోరో అర్థం చేసుకోవచ్చు..

యావత్ ప్రపంచాన్ని కరోనా గడగడలాడిస్తూ వస్తోంది. ఆ దేశం ఈ దేశం అనే మాటేలేదు. కల్లోలం సృష్టిస్తోంది.ఈ నేపధ్యంలో భారత్ కూడా కరోనాకు వణికిపోయింది. ఈ పరిస్థితులను గమనించిన ఆగర్-మాల్వా గ్రామానికి చెందిన ప్రజలు ఎంతో అప్రమత్తమయ్యారు. కరోనా కట్టడి చర్యలను కఠినంగా అమలు చేశారు. ముఖ్యంగా గ్రామంలోని మహిళలుల అత్యంత అప్రమత్తంగా వ్యవహరించారు. తగిన జాగ్తత్తలు తీసుకోవటంలో కఠినంగా వ్యవహరించారు.

గ్రామంలోని మహిళలంతా తమ ఇళ్లను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తూన్నారు. ఏ ఇంటి నుంచి ఎవరు బయటకు వెళ్లి వచ్చినా తప్పనిసరిగా పరిశుభ్రత పాటిస్తున్నారు. ఇదేవిధంగా గ్రామంలోని కొందరు యువకులు ఒక టీమ్‌గా ఏర్పడి, కొత్తగా ఎవరు వచ్చినా… వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్న తరువాతనే గ్రామంలోనికి రానిస్తున్నారు. గ్రామ సరిహద్దుల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి..మాస్కులు పెట్టుకుని, శానిటైజ్ చేసుకుంటూ..ఫిఫ్టులవారిగా అనుక్షణం కాపలాకాస్తున్నారు. గ్రామ సరిహద్దుల్లో కాపలాగా ఉంటున్నారు. దీంతో ఈ నాటికీ గ్రామంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు మధ్యప్రదేశ్‌లోని ఆగర్- మాల్వా గ్రామంలో.