Bhagoriya Festival Special in Holi : ‘భాగోరియా’వేడుక : రంగులు చల్లేస్తారు..ఓకే అంటే మూడు ముళ్లు వేసేస్తారు..

Bhagoriya Festival Special in Holi : ‘భాగోరియా’వేడుక : రంగులు చల్లేస్తారు..ఓకే అంటే మూడు ముళ్లు వేసేస్తారు..

Bhagoria Special

MP’s Bhagoria Festival Special : రంగు కేళీ హోలీ పండుగ. ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుని ఆడుకునే వసంతాల ఆట. అటువంటి హోలీ పండుగ సందర్భంగా ఓ ప్రాంతంలో గిరిజనులు పెళ్లిళ్లు కుదుర్చుకుంటారు. రంగులు చల్లుకుని అమ్మాయిలను ఓకే చేసుకునే సంప్రదాయంలో అన్నీ విశేషాలే. ఆ విశేషాల వేడుక పేరు ‘భాగోరియా’ భాగోరియా పండుగ హోలీ పండుగకు వారం రోజుల ముందే ప్రారంభమవుతుంది. ఈ వేడుకను ‘‘వివాహ్ బజార్’’అని అంటారు గిరిజనులు. ఈ వేడుకలో అమ్మాయిల మీద అబ్బాయిలు రంగులు చల్లుతారు. రంగులు చల్లిని అబ్బాయి అంటే ఇష్టమైతే ఆ అమ్మాయి ఓకే చెబుతుంది. ఆమె ఓకే అంటే ఇక మూడు ముళ్లు పడి వారి భార్యాభర్తలు అయిపోయినట్లే..ఈ వేడుకను భాగోరియా మేళా అంటారు. లేదా వివాహ్ బజార్ అంటారు మధ్యప్రదేశ్ లోని గిరిజనులు.

1

మధ్యప్రదేశ్ లోని పలు గిరిజన ప్రాంతాల్లో జరిగే ఈ వివాహ్ బజార్  గురించి తెలుసుకోవాల్సిందే. నిమార్, బజబువా, ధార్, బద్వానీ, అలిరాజ్ పూర్ ప్రాంతాల్లోని భిల్, భైలాల్ తెగలకు చెందిన గిరిజనులు హోలీ పండుగకు వారం రోజుల ముందు నుంచే భాగోరియా పండుగ జరుపుకుంటారు.

2

ఇందులో ఆయా తెగలకు చెందిన గిరిజన యువతులు, యువకులు ఉత్సాహంగా పాల్గొంటారు. తరువాత రంగులు కలిపిన పాత్రలు పట్టుకుని అమ్మాయిలు అబ్బాయిల మీదా..లేదా అబ్బాయిలు అమ్మాయిల మీద రంగులు చల్లుకుంటారు.అలా తమ మీద రంగులు చల్లిన అబ్బాయి అమ్మాయికి నచ్చినా..అలాగే రంగులు చల్లిన అమ్మాయి అబ్బాయికి నచ్చితే ‘నువ్వంటే నాకు ఇష్టం ’’అని చెబుతారు. వారికి ఇష్టమైతే ఇక వారి వివాహం ఖాయం అయిపోయినట్టే. ఒకరంటే మరొకరికి నచ్చితే అక్కడ నుంచి వెళ్లిపోతారు. అలా వెళ్లిపోయిన జంటను దంపతులుగా గుర్తిస్తారు.ఇక అప్పటికే ప్రేమించుకున్నవారైతే ఈ హోలి పండుగ సందర్బంగా వచ్చే భాగోరియా పండుగను చక్కగా ఉపయోగించుకుంటారు. ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుని భార్యాభర్తలైపోతారు.

11

కాగా భాగోరియా అనే మాట ‘భాగ్’నుంచి వచ్చిందంటారు. పంట కోసే ముందు వచ్చే ఈ భాగోరియా పండుగను మధ్యప్రదేశ్ లోని పలు గిరిజన ప్రాంతాల వారు చాలా ఘనంగా జరుపుకుంటారు. అలాగే ఈ భాగోరియా పండుగలో మొదటిసారి పాల్గొన్న అంటే పార్వతీ దేవి అనీ.. ఆమె పేరు భావ్ అని అంటారు. భావ్ శివుడి కోసమే వచ్చి..ఈ పండుగలో శివుడిని వివాహం చేసుకుందని అందుకనే భాగోరియా అనే పేరు వచ్చిందని అంటారు.

10

అలాగే మరొక కథనం కూడా ఉంది. అది భాగోర్ అనే రాజు ఈ ప్రాంతాన్ని జయించాడనీ..తమ సైన్యంతో ఈ ప్రాంతానికి వచ్చాక..అక్కడ ఉండే గిరిజన యువతులను ఇష్టపడి అలా వారి కూడా ఇష్టపడి వారు పారిపోవటానికి భగోర్ రాజు అనుమతి ఇచ్చాడనీ అప్పటి నుంచి ఇక్కడ భోగోరియా పండుగ ప్రారంభమైందని చెబుతారు.

6

ఈ భాగోరియా పండుగ ద్వారా గిరిజనుల సంప్రదాయం ద్వారా నేటి సభ్య సహాజం నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది. ఇష్టమైన వ్యక్తులను పెళ్లి చేసుకుంటే అనారికంగా హత్యలు చేసే నేటి సమాజం గిరిజనుల నుంచి నేర్చుకోవాల్సింది ఈ బాగోరియా జాతర ద్వారా ఎంతైనా ఉంది. తమకు నచ్చిన యువతులను..లేక యువకులను పెళ్లి చేసుకునే సంప్రదాయం ఉంది ఈ పండుగలో.

4

అలాగే మరొక మంచి విషయం ఏమిటంటే..ఈ భాగోరియా పండుగలతో తమపై రంగులు చల్లిన అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు..వారికి నచ్చకపోతే ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఆ రంగుల పండుగను ఒక వేడుకలా జరుపుకుంటారు. ఉత్సాహంగా..ఆనందంగా జరుపుకుంటారు. అంతేతప్ప..నచ్చిన అమ్మాయి మీద రంగు చల్లితే ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ఇష్టపడకపోతే అతను ఏమీ అనడు..అనుకోడు..మరొక అమ్మాయిని వెతుక్కుంటారు. అంతేతప్ప ‘‘నేను రంగులు చల్లి ఇష్టమని చెబితే నన్నే వద్దంటుందా? నీ అంతు చూస్తానంటూ ఏ అఘాయిత్యానికి పాల్పడడు.

11

 

కానీ మన సభ్య సమాజంలో మాత్రం అలాకాదు..ప్రేమించలేదని చెప్పినా..పెళ్లి చేసుకోనని చెప్పినా యాసిడ్లు పోయటం..గొంతులు కోయటం..ప్రాణాలు తీయటం లాంటి ఘాతుకాలకు పాల్పడుతుంటారు. కానీ భాగోరియా గిరిజన సంప్రదాయంలో అటువంటి అనాగరిక పనులు ఏమీ ఉండవు. ఇష్టమైతే వివాహం లేదంటే లేదు అంతే.. గిరిజనులు వారి సంప్రదాయాలకే కాదు ప్రకృతిని తలపించే రంగులకు అంత విలువ, గౌరవం ఇస్తారు.

3

 

అలాగే ఈ భాగోరియా సంప్రదాయంలో చెడును విడిచిపెట్టి మంచిని పెంచుకునే దిశగా గిరిజనులు సాగారు. ఒకప్పుడు ఈ భాగోరియా పండుగలో రక్తపాతం జరిగేదట. స్వాతంత్ర్యానికి ముందు ఈ భాగోరియా జాతరలో తీవ్ర రక్తపాతం జరిగేదట. తమ శతృవులుగా భావించేవారిపై దాడికి దిగేవారట. కానీ గిరిజన తెగల్లో వచ్చిన మంచి మార్పు కాస్తా..రక్తాలు పారే అనాగరికత నుంచి రంగులు చల్లే అందమైన పండగలకు తెర తీశారు అడవి బిడ్డలు ఈ గిరిజనులు..దీన్ని బట్టి చూస్తే సంప్రదాయాలు..కులాలు, మతాల పేరుతో చెడును వదిలి మంచివైపు నడవాలనే చక్కటి సందేశాన్నిస్తోంది ఈ భాగోరియా జాతర..