కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు…మహారాష్ట్రలో త్వరలో బీజేపీ ప్రభుత్వం

  • Published By: venkaiahnaidu ,Published On : March 10, 2020 / 12:26 PM IST
కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు…మహారాష్ట్రలో త్వరలో బీజేపీ ప్రభుత్వం

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(RPI)చీఫ్,కేంద్రమంత్రి రామ్ దాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు. ఓ వైపు మధ్యప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ ను కూలదోసి అధికారం చేపట్టే దిశగా బీజేపీ ప్రయత్నిస్తున్న సమయంలో మహారాష్ట్రలో ఆపరేషన్ కమలం ఉంటుందని అథవాలే పరోక్షంగా సంకేతాలిచ్చారు.

మహారాష్ట్రలో ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ త్వరలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహావికాస్ అఘాడి ప్రభుత్వం పట్ల చాలామంది శివసేన ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని,ఈ కారణంగా రాష్ట్రంలో తర్వలోనే రాజకీయ భూకంపం రావొచ్చని అథవాలే తెలిపారు. త్వరలోనే శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే త్వరలోనే తన మనసుని మార్చుకుంటారని రామ్ దాస్ అన్నారు.

దీని కారణంగా మహారాష్ట్రలో ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం కూలిపోతుంది,బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. అయితే శివసేనతో ఇప్పటివరకు తాను ఎలాంటి చర్చలు జరుపలేదని రామ్ దాస్ సృష్టం చేశారు. మహారాష్ట్రలో ఆర్ పీఐ పార్టీ బీజేపీ భాగస్వామ్య పక్షంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

మరోవైపు మధ్యప్రదేశ్ లో 22మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ముఖ్య నాయకుడు జ్యోతిరాధిత్య సింధియా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీకి జై కొట్టడంతో మధ్యప్రదేశ్ లో రాజకీయ వాతావరణం ప్రస్తుతం చాలా వేడిగా ఉంది. కర్ణాటకలో మాదిరిగా కుదిరితే త్వరలోనే మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం సృష్టంగా కనిపిస్తోంది.