ముఖానికి Mask వేసుకుని స్టెప్పులేసిన సీఎం

ముఖానికి Mask వేసుకుని స్టెప్పులేసిన సీఎం

Madhya Pradesh Chief Minister Dances : ఏదైనా సాంగ్, డప్పు, దరువులు వింటుంటే తెలియకుండానే…కాళ్లు కదిపిస్తుంటాం. సామాన్యుడి నుంచి సెలబ్రెటీల వరకు స్టెప్పులు వేస్తుంటారు. ఏదైనా కార్యక్రమంలో పాల్గొనే నేతలు..సంగీతానికి అనుగుణంగా స్టెప్పులు వేస్తూ..అదరగొడుతుంటారు. ఇలాగే..మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ డ్యాన్స్ వేస్తూ..వహ్వా అనిపించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సెహోర్ జిల్లాల్లోని భిలాయ్ గ్రామంలో అడవులపై ఆదివాసీలకు హక్కులు కల్పిస్తూ…పట్టాలను జారీ చేసే కార్యక్రమం జరిగింది. ఈ ప్రోగ్రామ్‌కు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరయ్యారు. లీజు పట్టాలను వారికి అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఆదివాసీలకు తమ ప్రభుత్వం మేలు చేసే కార్యక్రమాలు చేపడుతోందన్నారు. వీరికి సంబంధించిన భూములను స్వాధీనం చేసుకొనేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని, ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం వారికి న్యాయం చేసిందని చెప్పుకొచ్చారు. పరిశ్రమల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టామన్నారు.

ఈ సందర్భంగా..గిరిజనులు కొంతమంది వేదిక దగ్గర సంప్రదాయ నృత్యం చేశారు. దీనికి అనుగుణంగా..వేదికపైనున్న నేతలు అందంగా అలంకరించిన విల్లులు చేతపట్టుకుని డ్యాన్స్ చేశారు. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా లేచి..మాస్క్ ధరించి..విల్లులు ఓ చేతితో పట్టుకుని..ఆనందంగా స్టెప్పులు వేశారు. అక్కడున్న వారు..వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.