Madhya Pradesh : రూ. 8 కోట్లు ఖర్చు పెట్టారు..8 నెలలు కరోనాతో పోరాడి రైతు మృతి

కరోనా వైరస్ ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా రూ. 8 కోట్లు ఖర్చు పెట్టినా..ఓ రైతును అతని కుటుంబం కాపాడలేకపోయింది. పేరు మోసిన వైద్యులు చికిత్స...

10TV Telugu News

Corona 50 Year Old Farmer From MP Dies : కరోనా వైరస్ ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా రూ. 8 కోట్లు ఖర్చు పెట్టినా..ఓ రైతును అతని కుటుంబం కాపాడలేకపోయింది. పేరు మోసిన వైద్యులు చికిత్స చేసినా..కరోనా కాటుకు బలయ్యాడు. సుమారు 8 నెలల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ..తుదిశ్వాస విడిచాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన అందర్నీ కలిచివేసింది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Read More : TTD : శ్రీవారి ఆలయంలో భక్తుల ఆందోళన, పెద్ద ఎత్తున నినాదాలు

మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్ తాలుకా ర‌క్రి గ్రామానికి చెందిన ధ‌ర‌మ్‌ జై సింగ్‌కు గ‌తేడాది మే 2న క‌రోనా సోకింది. దీంతో ఆయ‌న్ను వెంట‌నే రెవాలో ఉన్న సంజ‌య్ గాంధీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ట్రీట్‌మెంట్ జ‌రుగుతుండ‌గా ఆయ‌న ప‌రిస్థితి విషమించడంతో.. మే 18న చెన్నైలోని అపోలో ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అప్పటికే ఆయ‌న ఊపిరితిత్తులు 100 శాతం డ్యామేజ్ అయిపోయాయి. దీంతో సింగ్‌ను డాక్టర్లు ECMO మీద ఉంచారు.

Read More : Jallikattu : నో మాస్క్..భౌతిక దూరం లేదు..జల్లికట్టు పోటీలు ప్రారంభం

దేశంలోనే పేరుమోసిన డాక్టర్లు ఆయ‌నకు ట్రీట్‌మెంట్ చేశారు. అయిన‌ప్పటికీ.. 8 నెల‌ల పాటు క‌రోనాతో పోరాడి చివ‌ర‌కు అపోలో ఆసుప‌త్రిలో క‌న్నుమూశాడు. ఆయన వైద్యఖ‌ర్చుల కోసం కుటుంబ స‌భ్యులు త‌మ‌కున్న 50 ఎక‌రాల వ్యవ‌సాయ భూమిని అమ్మి 8 కోట్లు ఖ‌ర్చు పెట్టారు. ఆసుప‌త్రిలో ఒక రోజుకు 3 ల‌క్షలు చెల్లించారు. అంత డ‌బ్బు ఖ‌ర్చు పెట్టినా కూడా సింగ్‌ను మాత్రం ప్రాణాల‌తో కాపాడుకోలేక‌పోయామ‌ని కుటుంబ స‌భ్యులు వాపోయారు.

×