Farmer donation : కూతురి పెళ్లి కోసం దాచిన డబ్బుని…ఆక్సిజన్ కోసం విరాళమిచ్చిన రైతు

మధ్యప్రదేశ్ నీముచ్ జిల్లాలోని దేవియాన్ గ్రామానికి చెందిన చంపాలాల్ గుర్జార్ అనే రైతు తన కూతురి పెళ్లికోసం దాచుకున్న 2 లక్షల రూపాయలను ఆక్సిజన్ కోసం విరాళంగా అందించారు. ఈ మొత్తాన్ని రైతులకు నీముచ్ జిల్లా కలెక్టర్ అగర్వాల్ కు అందజేశారు.రైతు ఔదార్యంపై ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు.

Farmer donation : కూతురి పెళ్లి కోసం దాచిన డబ్బుని…ఆక్సిజన్ కోసం విరాళమిచ్చిన రైతు

Farmer Donation (1)

MP Farmer donation for oxygen : భారత్ లోని అన్ని రాష్ట్రాల్లోను కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. వేలాదిమంది ప్రాణాల్ని హరిస్తోంది. ఎంత దారుణంగానంటే..మృతదేహాలకు అంత్యక్రియలు చేయటానికి శ్మశానాలు సరిపోవటంలేనంతగా..కాల్చటానికి కట్టెలు కూడా దొరకనంతగా జనాలు కరోనాతో మృత్యవాత పడుతున్నారు. కరోనా ప్రళయానికి రోగులకు ఆక్సిజన్ కూడా అందటంలేదు. దీంతో మృతుల సంఖ్య రోజురోజుకే కాదు గంట గంటకూ పెరుగుతోంది. ఆక్సిజన్ అందక ఊపిరులు ఆగిపోతున్నాయి. ప్రాణాలుగాల్లో కలిసిపోతున్నాయి. ఆత్మీయుల రోదనలు మిన్నంటుతున్నాయి.

ఇప్పటికే అనేక దేశాల నుంచి ఆక్సిజన్ ను దిగుమతి చేసుకుంటున్నారు. అంతేకాదు, అనేక మంది వ్యాపారవేత్తలు కరోనా మహమ్మారిపై పోరాటం చేసేందుకు విరాళాలు ప్రకటిస్తున్నారు. దాతలు ఎవరికి తోచినంత వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలా ఆక్సిజన్ అందించటానికి తన వంతుగా మధ్యప్రదేశ్ కు చెందిన ఓ రైతన్న అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

నీముచ్ జిల్లాలోని దేవియాన్ గ్రామానికి చెందిన చంపాలాల్ గుర్జార్ అనే రైతు తన కూతురి పెళ్లికోసం దాచుకున్న 2 లక్షల రూపాయలను ఆక్సిజన్ కోసం విరాళంగా అందించారు. ఈ మొత్తాన్ని రైతులకు నీముచ్ జిల్లా కలెక్టర్ అగర్వాల్ కు అందజేశాడు. రైతు ఔదార్యంపై ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. గత ఆదివారం (ఏప్రిల్ 25,2021) చంపాలాల్ కుమార్తె అనిత వివాహం జరిగింది. తన పెళ్లికి ముందే బాధితుల కోసం తన వివాహానికి ముందే వివాళం ఇవ్వాలని వధువు తండ్రిని కోరింది. దీంతో కూతురు వివాహానికి ముందే చంపాలాల్ రూ.2లక్షలను కలెక్టర్ కు అందజేశాడు.