నీట్ ఫలితాల్లో పొరపాటు.. ఆరే మార్కులు వచ్చాయని ఉరేసుకున్న యువతి

  • Published By: vamsi ,Published On : October 24, 2020 / 04:52 PM IST
నీట్ ఫలితాల్లో పొరపాటు.. ఆరే మార్కులు వచ్చాయని ఉరేసుకున్న యువతి

కొన్నిసార్లు యంత్రం చేసిన పొరపాటు అయినా.. మానవుడు చేసిన తప్పు అయినా.. దాని ఫలితం ఒక జీవితం కావచ్చు.. ఇది కంప్యూటర్ పొరపాటో.. నీట్( NEET) అధికారులు చేసిన తప్పిదమో తెలియదు కానీ, ఫలితాలు తప్పుగా రావడంతో ఒక విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. నీట్ పరీక్షా ఫలితాలు (Results) జరిగిన పొరపాటు కారణంగా ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

నీట్ పరీక్షా ఫలితాలు ఓ అమ్మాయి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడడానికి కారణం అయ్యింది. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాకు చెందిన సూర్యవంశీ (Vidhi Suryavanshi ) చిన్నానాటి నుంచి డాక్టర్ కావాలని కలలు కనేది. అందుకోసం కష్టపడి చదివింది కూడా.. నీట్ పరీక్షలకు(NEET Results 2020) కోసం ఎన్నో రోజులుగా కష్టపడి చదువుతుంది. కరోనా కష్టకాలంలో నీట్ పరీక్షలు ఆలస్యం కాగా.. ఫలితాలు రావడం లేట్ అయ్యాయి. ఇటీవల దీనికి సంబంధించి పరీక్షలు జరగగా.. ఫలితాలు వచ్చాయి. అందులో చెక్ చేస్తే ఆరు మార్కులే కనిపించడంతో తీవ్ర మనస్థాపానికి గురై.. మానసికంగా కూడా బాగా డిస్టర్బ్ అయింది.

ట్‌లో మంచి మార్కులు వస్తాయని ఊహిస్తే ఫలితాల్లో కేవలం 6 మార్కులే రావడంతో షాక్‌కు గురై.. అంత తక్కువ మార్కులు రావడం అనేది పొరాపాటు వల్ల జరిగినా.. 590 మార్కులు వచ్చినా.. తీవ్ర మనస్తాపానికి గురై రెండు రోజుల క్రితం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. డాక్టర్‌ కావాలనుకున్న అమ్మాయి జీవితం ముగిసిపోయింది. తమ కుమార్తెకు ఇంత తక్కువ మార్కులు వస్తాయని తల్లిదండ్రులు కూడా నమ్మలేకపోయారు.

దీంతో వారు ఓఎమ్‌ఆర్‌ సీటును తెప్పించి చూడగా విద్యార్ధినికి 720కి గానూ 590 మార్కులు వచ్చి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలైంది. అయితే 18ఏళ్లకే నిండు నూరేళ్ల జీవితాన్ని ముగించుకుని ఈ లోకం నుంచి వెళ్లిపోయిన సూర్యవంశి తల్లిదండ్రులు మాత్రం తీవ్రమ శోకంలో మునిగిపోయారు.