Hijab Controversy : మధ్యప్రదేశ్ స్కూల్ లో హిజాబ్ తప్పనిసరి.. పాఠశాల గుర్తింపు రద్దు చేసిన ప్రభుత్వం

నిబంధనలు అతిక్రమించినందుకే చర్యలు తీసుకున్నట్లు సీఎం శివ్ రాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని తన మేనల్లుళ్లు, కోడళ్ల పట్ల ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్నారు.

Hijab Controversy : మధ్యప్రదేశ్ స్కూల్ లో హిజాబ్ తప్పనిసరి.. పాఠశాల గుర్తింపు రద్దు చేసిన ప్రభుత్వం

Hijab

Madhya Pradesh : మధ్యప్రదేశ్ లో హిజాబ్ వివాదం కొనసాగుతోంది. విద్యార్థినులకు హిజాబ్ తప్పనిసరి చేసిన పాఠశాల గుర్తింపును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. దమోహ్ జిల్లా కేంద్రంలోని గంగా జమున హయ్యర్ సెకండరీ స్కూల్ లో విద్యార్థినులకు స్కూల్ యాజమాన్యం హిజాబ్ తప్పనిసరి చేసింది.

అది ఏ వర్గం వారైనా హిజాబ్ తప్పనిసరిగా ధరించాలని తేల్చి చెప్పింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ స్కూల్ పై చర్యలు తీసుకుంది. విద్యార్థినులకు హిజాబ్ ధరించేలా ఒత్తిడి చేస్తున్నందుకు గానూ ఆ పాఠశాల గుర్తింపును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

Hijab: మధ్యప్రదేశ్ పాఠశాలలో మళ్లీ హిజాబ్ వివాదం…విచారణకు సర్కారు ఆదేశం

ఇది వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది. నిబంధనలు అతిక్రమించినందుకే చర్యలు తీసుకున్నట్లు సీఎం శివ్ రాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని తన మేనల్లుళ్లు, కోడళ్ల పట్ల ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్నారు.

అలాంటి చర్యలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ఈ మేరకు ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్ లో అలాంటి పనులకు స్థానం లేదన్నారు. దమోహ్ లాంటి స్కూళ్లను మూసివేస్తామని హెచ్చరించారు.