Madhya Pradesh : 13 నెలల పాప గొంతులో పచ్చిమిర్చి..ఊపిరాడక విలవిల

13 నెలల పాప గొంతులో పచ్చిమిర్చి ముక్క ఇరుక్కుని శ్వాస అందక విలవిల్లాడింది. గొంతులో ఏదైనా ఇరికితే...పెద్దవాళ్లే అష్టకష్టాలు పడుతుంటారు. అసలే చిన్నపాప..ఏమి జరిగిందో చెప్పడానికి కూడా మాటలు రావు..ఆ పసిపాప పడిన నరకయాతన అంతా ఇంతా కాదు. ఓ చిన్న పచ్చిమిర్చి ముక్క ఆ పాప ప్రాణాలకే ముప్పుగా మారింది.

Madhya Pradesh : 13 నెలల పాప గొంతులో పచ్చిమిర్చి..ఊపిరాడక విలవిల

Mirchi

Green Chili Piece Stuck : 13 నెలల పాప గొంతులో పచ్చిమిర్చి ముక్క ఇరుక్కుని శ్వాస అందక విలవిల్లాడింది. గొంతులో ఏదైనా ఇరికితే…పెద్దవాళ్లే అష్టకష్టాలు పడుతుంటారు. అసలే చిన్నపాప..ఏమి జరిగిందో చెప్పడానికి కూడా మాటలు రావు..ఆ పసిపాప పడిన నరకయాతన అంతా ఇంతా కాదు. ఓ చిన్న పచ్చిమిర్చి ముక్క ఆ పాప ప్రాణాలకే ముప్పుగా మారింది. ఆహార విషయంలో తల్లిదండ్రులు చేసిన ఓ పొరపాటు..పాప ప్రాణాలకు ప్రమాదంగా మారింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

Read More : Mahesh Babu Family : ఇట్స్ ఫ్యామిలీ టైం..

అదే పనిగా ఏడుస్తున్న చిన్నారి : –
కట్నీలో దీపిక్ రాజ్..భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. వీరికి 13 నెలల కూతురు ఉంది. ఓ రోజు అదే పనిగా చిన్నారి ఏడుస్తూనే ఉంది. తల్లిదండ్రులకు ఏమి జరిగిందో అర్థం కావడం లేదు. అటూ ఇటూ తిప్పారు. ఆట బొమ్మలు ఇచ్చారు. అన్ని చూపించారు..లాలించారు. అయినా..పాప మాత్రం ఏడుపు ఆపడం లేదు. చిన్నారి ఏడుపు విన్న పక్కింటి వారు వచ్చారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని సలహా ఇచ్చారు. దీంతో వారి మాట విని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పాప పరిస్థితిని వివరించారు.

Read More : ప్రజలను ఇంట్లోనే బందిస్తున్న చైనా

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది : –
చిన్నారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుందని వైద్యులు గుర్తించారు. డాక్టర్ కవిత సత్యదేవ పాపకు ఎండోస్కోపీ చేశారు. షాకింగ్ విషయం బయటపడింది. ఊపిరితిత్తులకు గాలి వెళ్లే గొట్టంలో పచ్చిమిర్చి ముక్క ఒకటి ఇరుక్కపోయినట్లు కనిపించింది. అసలు ఆ చిన్నారి పచ్చిమిర్చి ముక్క ఎలా తిందో అర్థం కాలేదు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులను అడిగారు. దంతాలు వచ్చినందున చిన్నపచ్చిమిర్చి ముక్క పెట్టామని సమాధానం ఇచ్చారు. వారిచ్చిన సమాధానంపై వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారిని ఎలాగైనా బతికించాలని వైద్యులు ప్ర్రయత్నించారు. ఆపరేషన్ మొదలు పెట్టారు.

Read More : Taliban warns India: ఇండియాకు తాలిబన్ల వార్నింగ్‌

గొంతులో పచ్చిమిర్చి : –
వారు జరిపిన స్పెషల్ ఆపరేషన్ లో గొంతులో ఇరికిన పచ్చిమిర్చిని బయటకు తీశారు. దీంతో పాప హాయిగా శ్వాస తీసుకోవడం ప్రారంభించింది. ఆపరేషన్ ఆలస్యం అయి ఉంటే చిన్నారి చనిపోయేదని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం పాప చికిత్స పొందుతోందని..అంతా బాగుందని అనుకున్న తర్వాత డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు వెల్లడించారు. ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలని, మెత్తటి భోజనం చిన్నారులకు పెట్టాలని సూచించారు.