Corona Deaths: కోవిడ్ మరణాలు దాస్తున్నారా? షాకింగ్ నిజాలు వెలుగులోకి!

Corona Deaths: కోవిడ్ మరణాలు దాస్తున్నారా? షాకింగ్ నిజాలు వెలుగులోకి!

Madhya Pradesh Hiding Covid 19 Deaths 94 Bodies Cremated In Bhopal

COVID-19 deaths: కరోనా మరణాలు కరెక్ట్‌గా చెప్పకుండా కొన్ని రాష్ట్రాల్లో అంకెల్లో గారడీలు చేస్తున్నాయా? సరిగ్గా చెప్పకుండా అంకెలు మార్చి చెబుతూ.. ప్రజలకు భయం లేదని చెబుతున్నాయా? అవుననే సమాధానమే వినిపిస్తోంది. నిజమే.. లేటెస్ట్‌గా క‌రోనా మృతుల లెక్క‌ను మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం దాస్తున్న‌ట్లుగా స్పష్టమైన ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.

రాష్ట్రంలో స్మ‌శాన‌వాటిక‌ల‌కు ప్ర‌తిరోజు వ‌ందల్లో కరోనా మృత‌దేహాలు వ‌స్తుండగా.. ప్ర‌భుత్వ లెక్క‌ల్లో మాత్రం మృతుల సంఖ్య‌ను చాలా తక్కువగా చూపిస్తున్న‌ది. రాష్ట్రంలో నిన్న ముగ్గురు మాత్ర‌మే చనిపోయినట్లుగా నిర్దారించడం అనుమానాలకు తావిస్తోంది.

టైమ్స్ నౌ కథనం ప్రకారం.. ఒక్క భోపాల్‌లోనే నిన్న 94 మృత‌దేహాల‌కు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించగా.. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో శ్మ‌శాన‌వాటిక‌ల వ‌ద్ద భారీ సంఖ్య‌లో వాహ‌నాలు బారులుతీరి ఉంటున్నాయి.

మృత‌దేహాల‌ను దహనం చెయ్యడానికే మూడు నాలుగు గంట‌ల‌కుపైగా వేచి ఉండాల్సి వ‌స్తుండగా.. కొంద‌రికైతే అంతిమ సంస్కారాలు నిర్వ‌హించ‌డానికి స్థ‌లం దొర‌క‌ట్లేదు. మరికొందరు శవాలను స్మశానవాటికల్లో వదిలేసి వెళ్తున్నారు. అటువంటి పరిస్థితిలో.. ప్ర‌భుత్వం రోజువారీ క‌రోనా మృతుల‌ను మూడుగా చూపించడం అనుమానాలకు కారణం అవుతుంది.

కరోనా మరణాలను ఇంత తక్కువగా చూపించడానికి కారణం ఏంటీ? అనేది అర్థం కావట్లేదు అంటున్నారు. వాస్తవానికి కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నా కూడా మరణాలు మాత్రం తక్కువగా చూపిస్తాయి.