Buffalo Milk: గేదె పాలు ఇవ్వడం లేదంటూ పోలీస్ కంప్లైంట్

మధ్యప్రదేశ్ లోని భింద్ జిల్లాలో ఓ వ్యక్తి వింత ప్రవర్తన పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. రోజూ పాలిచ్చే గేదె ఒక్కసారిగా పాలు ఇవ్వడం మానేసిందంటూ పోలీసు స్టేషన్ మెట్లెక్కాడు.

Buffalo Milk: గేదె పాలు ఇవ్వడం లేదంటూ పోలీస్ కంప్లైంట్

Madhya Pradesh

Buffalo Milk: మధ్యప్రదేశ్ లోని భింద్ జిల్లాలో ఓ వ్యక్తి వింత ప్రవర్తన పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. రోజూ పాలిచ్చే గేదె ఒక్కసారిగా పాలు ఇవ్వడం మానేసిందంటూ పోలీసు స్టేషన్ మెట్లెక్కాడు. నయగావ్ గ్రామానికి చెందిన పోలీసులను సాయం కావాలంటూ అడుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

‘బబుల్ జాతవ్ (45), అనే వ్యక్తి నయాగావ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాడు. తన గేదె కొద్ది రోజులుగా పాలు ఇవ్వడం మానేసిందని అందులో పేర్కొన్నాడు’ అని డీఎస్పీ అరవింద్ షా తెలిపారు.

కొందరు గ్రామస్థులు గేదె ఒక్కసారిగా పాలు ఇవ్వడం మానేసిందంటే ఏవైనా తాంత్రిక పూజలు చేసి ఉంటారని.. ఆ ప్రభావంతోనే గేదె అలా ప్రవర్తిస్తుందంటూ చెప్పడంతో అది నమ్మి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు బబుల్. అలా కంప్లైంట్ ఇచ్చిన నాలుగు గంటల తర్వాత మళ్లీ వెళ్లి మళ్లీ ప్రయత్నించానని అయినా ఇవ్వడం లేదని పోలీసులను సాయం కోరాడు.

……………………………: తారక్ రెండు నెలల విరామం వెనుక అసలు నిజమేంటి?

‘స్టేషన్ అధికారితో మాట్లాడి.. ఆ గ్రామస్థునికి వెటర్నరీ డాక్టర్ సలహా ఇప్పించమని చెప్పాం. మరోసారి పోలీస్ స్టేషన్ కు వచ్చి థ్యాంక్స్ చెప్పి వెళ్లాడు. ఆదివారం ఉదయం మామూలుగానే పాలు ఇచ్చిందని సంతోషపడ్డాడు’ అని షా అన్నారు.