Murder Attack : దాడి చేసినా చావలేదని.. ఆస్పత్రిలో పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన వ్యక్తి

దాడి చేసిన చావలేదనే కక్షతో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వ్యక్తిని మరోసారి చంపటానికి యత్నించాడు. పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఘటన మధ్యప్రదేశ్ లో ని ఓ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. కొన్ని రోజుల క్రితం అదే రోగిపై ఓ వ్యక్తి చేసిన దాడిలో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నాడు. అదే వ్యక్తిపై దండగుడు నిప్పు పెట్టాడు.

Murder Attack : దాడి చేసినా చావలేదని.. ఆస్పత్రిలో పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన వ్యక్తి

Murder Attack On Patient

Murder Attack On Patient : మధ్యప్రదేశ్​ లో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రి చికిత్స పొందుతున్న రోగికి గుర్తు తెలియని ఓ వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. కొన్ని రోజుల క్రితం అదే రోగిపై ఓ వ్యక్తి చేసిన దాడిలో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నాడు. అదే వ్యక్తిపై దండగుడు నిప్పు పెట్టాడు. దీంతో గతంలో సదరు రోగిపై దాడి చేసిన వ్యక్తే మరోసారి ఆసుపత్రికి వచ్చి అతనికి నిప్పు పెట్టినట్లుగా తెలుస్తోంది. అంటే సదరు బాధితుడిని చంపాలనే కక్ష తోనే మళ్లీ మళ్లీ దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. దాడి చేసిన ప్రాణాలు పోలేదని..పదే పదే దాడులకు పాల్పడుతున్నట్లుగా ఈ ఘటనను బట్టి అర్థం అవుతోంది.

మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలోని బుందేల్ ఖండ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దామోదర్ కోరి అనే వ్యక్తిపై గురువారం (జూన్ 10,2021) ఓ దుండగుడు పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. వెంటనే అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది మంటలు ఆర్పి చికిత్సనందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. బాధితుడి నుంచి వివరాలు సేకరించి..కేసు నమోదుచేసుకున్న పోలీసు దర్యాప్తు చేపట్టారు. బాధితుడు చెప్పిన సమాచారం ప్రకారంగా సదరు దుండగుడి కోసం గాలించి పట్టుకన్నారు. నిందితుడి పేరు మిలాన్ మచ్చా రజాక్ గా పోలీసులు గుర్తించారు.

కాగా..అంతకుముందే బాధితుడికి..నిందితుడికి మధ్య పాత గొడవలు ఉన్నాయని..ఆ గొడవలతోనే దామోదర్ పై మిలాన్ మచ్చా దాడికి పాల్పడగా..గాయాలపాలైన దామోదర్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నాడు. కానీ ప్రాణాలతో బయటపడ్డాడనే కక్షతో మిలాన్ మరోసారి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా దాడి చేశాడు.పెట్రోలు పోసి నిప్పు పెట్టాడని పోలీసులు తెలిపారు.ప్రస్తుతం బాధితుడి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.

కాగా..బాధితుడిని నిప్పు పెట్టిన దృశ్యాలు ఆసుపత్రిలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. గురువారం పెట్రోల్ బాటిల్, లైటర్ తో ఆసుపత్రిలోకి ప్రవేశించిన రజాక్.. ఆ పెట్రోల్ ను దామోదర్ కోరిపై పోసి నిప్పుపెట్టినట్టు స్పష్టంగా కనిపించింది. ఆ వెంటనే మంటలతో దామోదర్, అక్కడి నుంచి తప్పించుకునేందుకు రజాక్ ఎగ్జిట్ గేట్ వైపు పరుగెత్తారు.ప్రస్తుతం దామోదర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తోంది. బాధితుడు చెప్పిన వివరాలు, సీసీటీవీ కెమెరాలో రికార్డయిన దృశ్యాల ప్రకారం నిందితుడు రజాక్ ను గోపాల్ గంజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.