రాజ్యసభ ఎన్నికల్లో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

  • Edited By: Subhan , June 20, 2020 / 03:17 PM IST
రాజ్యసభ ఎన్నికల్లో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

రాజ్యసభ ఎన్నికల్లో పాల్గొన్న సీనియర్ బీజేపీ ఎమ్మెల్యేకు కొన్ని గంటల తర్వాత కరోనా పాజిటివ్ అని తేలింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం పోలింగ్ జరిగింది. ఎన్నికల తర్వాత రిపోర్టు రావడంతో పాజిటివ్ అని తెలిసి ఓటు వేసేందుకు వచ్చిన వాళ్లంతా గందరగోళానికి లోనయ్యారు. హాస్పిటల్స్ కు వెళ్లి పరీక్షలు చేయించుకునేందుకు పరుగులు తీశారు. 

అందిన వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే శుక్రవారం మధ్యాహ్నం కరోనా పరీక్షల నిమిత్తం శాంపుల్స్ ఇచ్చారు. కాస్త ఒళ్లు నొప్పులతో పాటు ఇబ్బందిగా ఉండటంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆ రోజు సాయంత్రమే టెస్టుల్లో పాజిటివ్ అని వచ్చింది. విషయం తెలుసుకున్న ఇతర బీజేపీ ఎమ్మెల్యేలు యష్‌పాల్ సింగ్ సిసోడియా, దిలీప్ మఖ్వానా, దేవీలాల్ ధాకడ్ కరోనా టెస్టులు చేయించుకునేందుకు భోపాల్ లోని జేపీ హాస్పిటల్ కు వెళ్లారు. 

‘మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు ఇక్కడకు వచ్చి దిలీప్ మఖ్వానా, దేవీలాల్ ధాకడ్ లు టెస్టుల కోసం వచ్చారు. ఇక్కడకు వచ్చిన తర్వాతే మీడియా, సోషల్ మీడియాల ద్వారా మా ఎమ్మెల్యేల్లో ఒకరికి కరోనా పాజిటివ్ అని తెలిసిందని సిసోడియా అన్నారు. 

ఎటువంటి లక్షణాలు లేకపోయినా.. ముందు జాగ్రత్త చర్యగా COVID-19 టెస్టు చేయించుకున్నాం. రాజ్యసభ ఎన్నికల ప్రక్రియలో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నాం. అసెంబ్లీ క్యాంపస్ మొత్తం ప్రతి 15-20 నిమిషాలకొకసారి శానిటైజ్ చేయించాం. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా అతనిని ఎవరు కాంటాక్ట్ అయ్యారో తెలుసుకుంటున్నాం అని అన్నారు.