మధ్యప్రదేశ్ లో కూలిన వంతెన..రూ. 3.7 కోట్లు నీళ్ల పాలు

  • Published By: madhu ,Published On : August 31, 2020 / 09:08 AM IST
మధ్యప్రదేశ్ లో కూలిన వంతెన..రూ. 3.7 కోట్లు నీళ్ల పాలు

ఈ మధ్య వంతెనలు కూలడం కామన్ అయిపోయాయి. నిర్మించిన కొద్ది రోజులకే కూలిపోతుండడంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. నాణ్యత లేకుండా నిర్మాణాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణం పూర్తయిన రోజునే వంతెన కూలిపోయింది. సియోని జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.



భోపాల్ కు 350 కిలోమీటర్ల దూరంలో వైంగంగ నదిపై ఇటీవలే 150 మీటర్ల పొడవైన ఒక వంతెనను నిర్మించింది అక్కడి ప్రభుత్వం. ఈ వంతెన పూర్తయ్యిందని, త్వరలోనే ప్రారంభిస్తామని అధికారులు 2020, ఆగస్టు 30వ తేదీ ఆదివారం ప్రకటించారు.
https://10tv.in/most-serious-situation-after-1962-s-jaishankar-on-india-china-border-clash/
భారీ వర్షాలు, వరద ప్రవాహం పోటెత్తుండడంతో ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పలేదు. ఇలా చెప్పిన కాసేపటికే అమాంతం కూలిపోయింది. వైంగంగ నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో వంతెన కూలిపోయిందంటున్నారు.



ప్రధాన మంత్రి గ్రామీణ రోడ్ల పథకంలో భాగంగా…రూ. 3.7 కోట్ల వ్యయంతో ఈ వంతెనను నిర్మించారు. 2018 సెప్టెంబర్ 01 నిర్మాణ పనులు చేపట్టారు. ప్రారంభించకుండానే..కూలిపోవడంపై పలు విమర్శలు చేస్తున్నారు.

సియోని జిల్లాలోని సున్వారా, భీమ్ గడ్ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వంతెన కూలిపోయిన ఘటపై విచారణ చేపడుతామని, దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఆ జిల్లా కలెక్టర్ వెల్లడించారు.