బుడగలు ఊది..ఒక్క ఊపిరి తిత్తితోనే కరోనాను జయించిన నర్సు

ఒకే ఊపిరితిత్తి ఉన్న ఓ నర్స్ కరోనాను కేవలం 14 రోజుల్లో జయించించి విజయం సాధించింది. బెలూన్లు ఊది, యోగా చేసి కరోనా నుంచి ధైర్యంగా ఎదరించింది.

బుడగలు ఊది..ఒక్క ఊపిరి తిత్తితోనే కరోనాను జయించిన నర్సు

Nurse Battles Covid With One Lung Recovers

nurse battles covid with one lung recovers Blowing balloons : కరోనా సోకి ఊపిరి అందక వేలాది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కానీ ఒకే ఒక్క ఊపిరి తిత్తితో జీవిస్తున్న ఓ నర్సు కరోనా మహమ్మరిని జయించింది. ఎలాగో తెలుసుకుంటే ఎన్నో ప్రాణాల్ని రక్షించవచ్చు కదా. నిజమే. కరోనా వచ్చిందనే భయం..ఊపిరి ఆడటంలేదనే ఆందోళనతో కూడా కొన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కానీ ఒక్క ఊపిరితిత్తితో తనపై దాడిచేసిన కరోనా వైరస్ ను 14 రోజుల్లోనే తరిమికొట్టింది మధ్యప్రదేశ్ కు చెందిన ప్రఫులిత్ పీటర్. అనే నర్సు.

మధ్యప్రదేశ్‌కు చెందిన నర్సు ప్రఫులిత్ పీటర్ టికామ్‌గఢ్ ఆసుపత్రిలోని కొవిడ్ వార్డులో పనిచేస్తోంది. కరోనా రోగులకు సేవలు చేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు కూడా ఈ మహమ్మారి అంటుకుంది. దీంతో ఒక్క ఊపిరి తిత్తితోనే బతికే బిడ్డ ఏమైపోతుందోనని కుటుంబ సభ్యులు భయపడిపోయారు. కరోనా తొలుత ఊపిరితిత్తులపైనే ప్రభావం చూపుతుందనే విషయం తెలిసిందే. అందుకే వారి భయం. ప్రపులిత్ కు ఒకటే ఊపిరితిత్తి ఉండడంతో మరింతగా కంగారుపడిపోయారు. కానీ ప్రపులిత్ మాత్రం కేవలం 14 రోజులపాటు హోం ఐసోలేషన్‌లో ఉండి..వేగంగా కోలుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.

ప్రఫులిత్ పీటర్ చిన్నప్పుడు ఓ ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైంది. బిడ్డను ఎలాగైనా బతికించుకోవాలని తల్లిదండ్రుల ఆరాటం గురించి తెలిసిందే. అలాగే ఆమె తల్లిదండ్రులు కూడా ఆరాటపడ్డారు. ప్రమాదంలో ఒక ఊపిరితిత్తి బాగా డ్యామేజ్ అయ్యిందనికాబట్టి ఆపరేషన్ చేసి ఒకదాన్ని తొలగించాలని చెప్పారు. వేరే దారి లేక కుటుంబ సభ్యుల అనుమతితో డాక్టర్లు ఒక ఊపిరితిత్తిని తొలగించారు. ఆ విషయం ప్రపులిత్ కు చెప్పలేదు తల్లిదండ్రులు.

అప్పటి నుంచి ప్రపులిత్ ఒక్క ఊపిరితిత్తితోనే జీవిస్తోంది. కానీ 2014లో చెస్ట్ ఎక్స్ రే తీసుకున్నప్పుడు తనకు ఒక్క ఊపిరితిత్తి మాత్రమే ఉందన్న విషయం తెలిసిసి షాక్ అయ్యింది. అప్పుడే తెలిసింది ఆమెకు ఆపరేషన్ ద్వారా తొలగించారని. అది అప్పటి సంగతి. ఇప్పుడ ప్రపులిత్ కు 39 సంవత్సరాలు. నర్స్‌గా పనిచేస్తోంది. ఇటీవల ఆమెకు కరోనా సోకింది. ఆ మహమ్మారితో ఒక్క ఊపిరితిత్తితోనే పోరాడి విజయం సాధించింది. అదికూడా 14రోజుల్లోనే.

అతి తక్కువ సమయంలోనే ఒకే ఒక్క ఊపిరితిత్తితో కరోనాను జయించిన ప్రపులిత్ అది తనకు ఎలా సాధ్యమైందో మాట్లాడుతూ..తనకు కరోనా సోకినా నేను భయపడలేదు. ధైర్యం కోల్పోలేదు. హోం ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు యోగా, ప్రాణాయామం, బ్రీతింగ్ ఎక్స్‌ర్‌సైజ్‌లు క్రమం తప్పకుండా చేసేదాన్ని. ఊపిరితిత్తులకు బూస్టింగ్ ఇవ్వటానికి బెలూన్లు ఊదేదాన్ని అని చెప్పుకొచ్చింది. ఆమె ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుంది. దీనికితోడు ధైర్యమే తనను గెలిపించిందని ప్రఫులిత్ చెప్పుకొచ్చింది.